హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు మొదటి గంటే ఎందుకు అంత కీలకం

మానవ శరీరంలో అత్యంత ప్రధానమైన భాగం గుండె. కాబట్టి గుండె విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. గుండె నొప్పి లేదా గుండె పోటు ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. కానీ, ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుది. గుండెకు రక్త నాళాల ద్వారా జరిగే సరఫరాలో ఏదైనా ఆటంకం కల్గితే వెంటనే గుండె నొప్పి వచ్చి ఆక్సీజన్‌తో కూడిన మంచి రక్తం గుండెకు సరఫరా కాక హార్ట్‌ ఎటాక్‌ వస్తుంది. అయితే హార్ట్‌ఎటాక్‌ వచ్చినప్పుడు మొదటి గంటే అత్యంత కీలకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా కేసుల్లో హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన కొన్ని గంటల తర్వాతనే వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లడంతో ప్రాణాలు దక్కడం లేదు.

Heart Attackహార్ట్‌ఎటాక్‌ వచ్చిన మొదటి గంట తర్వాతనే శరీరానికి రక్త ప్రసరణ ఆగిపోతుందని, అందుకే ఆ మొదటి గంటను గోల్డెన్‌ అవర్‌ అంటారన్నారు. ఏమాత్రం ఛాతీలో నొప్పి, ఇబ్బందిగా ఉన్నట్లు అనుమానం వస్తే వైద్యులను సంప్రదించాలి. ఈమధ్య ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు కొందరు అసిడిటీ అని భావించి నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో ప్రమాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉన్నట్టుండి హార్ట్‌ ఎటాక్‌ వచ్చి మరణాలు సంభవిస్తున్నాయని అంటుంటారు. కానీ.. నిజానికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ముందు వారి శరీరం అనేక సంకేతాలు ఇస్తుందని డాక్టర్‌ తెలిపారు.

Heart Attackగుండె నొప్పి వ‌చ్చే ముందు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా ఉంటుంది. అలాగే అస్త‌మా ఉన్న‌ప్పుడు కూడా గాలి పీల్చుకోవ‌డం క‌ష్టంగానే ఉంటుంది. గుండె భారంగా ఉన్నా గుండెపోటుకు దారితీస్తుంది. ప‌నిచేసేట‌ప్పుడు కాకుండా ఖాళీగా ఉన్న‌ప్పుడు కూడా అధికంగా చెమ‌ట‌లు ప‌డుతుంటే నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

Heart Attackమాట్లాడే మాట‌లు త‌డ‌బ‌డ‌డం, చెప్పిందే చెప్ప‌డం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. అసిడిటీ, గ్యాస్ ట్ర‌బుల్‌, ఆహారం జీర్ణం కాక‌పోయినా గుండెనొప్పికి దారితీస్తాయి. కంటి చివ‌రిలో కురుపులు అదిక‌మ‌వుతున్నా సంకేత‌మే.

Heart Attackఆ స‌మ‌యంలో ర‌క్త‌ప్ర‌స‌ర‌ణ త‌క్కువ‌గా ఉంటుంది. దీనివ‌ల్ల గుండెల్లో మంట‌గా ఉంటుంది. అలాంట‌ప్పుడు వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. జ‌లుబు, ద‌గ్గు, జ్వరం ఎన్ని రోజుల‌కీ త‌గ్గ‌క‌పోయినా అనుమానించాలి. ఇవి కూడా గుండెపోటుకి దారితీస్తుంది. ద‌వ‌డ నొప్పులు, గొంతునొప్పి ఎక్కువ‌గా ఉన్నా హార్ట్ఎటాక్‌కు సంకేత‌మే. కాళ్లు, పాదాలు, మ‌డ‌మ‌లు ఉబ్బుతున్నా గుండెపోటుగా అనుమానించాలి

Heart Attackఇవికాక నిత్యం వ్యాయామం, మధ్యం, ధూమపానికి దూరంగా ఉండటం, క్రమశిక్షణ పరమైన జీవన విధానం, సరైన సమయానికి భోజనం చేయడం ఇలాంటి అలవాట్లు చేసుకుంటే హార్ట్‌ఎటాక్‌ నుంచి కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR