అక్కడ నక్కలకు ప్రసాదం పెడితే మనుషుల కోపం తగ్గిపోతుందా?

0
257

భారతదేశంలో ఒక్కో దేవాలయానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. నక్కలు క్రూరమృగాలు. మనిషి కనబడితే అవి చీల్చి చండాడుతాయి. కానీ ఒక్కచోట మాత్రం వాటిని దైవ స్వరూపంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతి రోజూ వాటికి దేవాలయంలో దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని అందిస్తారు. అటు పై మాత్రమే ఆ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఇది మరెక్కడో కాదు గుజరాత్ రాష్ర్టంలోని కాలో దుంగార్ అనే కొండ పై జరుగుతుంది.

dattatreya swamyఈ కొండ పై ఉన్న దత్తాత్రేయ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లే వారి పై ఈ నక్కలు ఇప్పటి వరకూ దాడి చేయడం జరగలేదని స్థానికులు చెబుతారు. అంతే కాకుండా కోపం ఎక్కువగా ఉన్నవారు ఈ ఆలయ సందర్శనంతో కొంత శాంత స్వభావంగా మారుతారని చాలా కాలంగా విశ్వసిస్తున్నారు. ఇన్ని విశిష్టతలు కలిగిన కాలోదుంగార్ ఆలయ కథనం ఏంటో ఇప్పుడు చూద్దాం.

dattatreya swamyపూర్వం స్థానిక రాజు ఒకరు దత్తాత్రేయుని పరమ భక్తుడు. ఆయన్ను పూజించనిదే ఒక్క ముద్ద కూడా తినేవాడు కాదు. అంతే కాకుండా దానశీలి కూడా. ఒకసారి దత్తత్రేయుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలో దత్తాత్రేయుడు నక్కరూపంలో రాజు వద్దకు వస్తాడు. తనకు ఆకలిగా ఉందని చెబుతారు. దీంతో రాజు తన వద్ద ఉన్న పండ్లు ఆ నక్కకు ఇస్తాడు. అయితే తాను మాంసాహారినని అందువల్ల మాంసం కావాలని నక్క అడుగుతుంది. దీంతో తన చేతిని ఆ నక్కకు ఆహారంగా ఇస్తాడు.

dattatreya swamyరాజు సేవ నిరతికి మెచ్చి దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యి మోక్షం ప్రసాదించాడని కథనం. అదువల్లే ఈ కొండ పై దత్తాత్రేయుని విగ్రహం కలిగిన చిన్న ఆలయం కూడా ఉంది. ఇక గత 400 ఏళ్లుగా ఒక ఆచారం ఇక్కడ క్రమం తప్పకుండా నడుస్తూ ఉంది. బెల్లం, బియ్యం కలిపి తయారు చేసిన ఆహారాన్ని ప్రతి రోజూ సాయంత్రం ఆలయ పూజారి అక్కడే ఉన్న అరుగు వద్దకు తీసుకువస్తాడు.

dattatreya swamyఅటు పై ఓ పళ్లెం పై కొడుతూ లే అంగ్…లే అంగ్…లే అంగ్ అంటూ అరుస్తాడు. దీంతో చుట్టు పక్కల ఉన్న నక్కలు అక్కడికి వచ్చి ఆహారాన్ని తిని అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఆ నక్కలు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కసారి కూడా హాని చేయలేదని భక్తులు చెబుతారు. ఇదంతా ఆ దత్తాత్రేయుని మహిమగా భావిస్తారు.

dattatreya swamyఇటీవల ఈ ప్రాంతం ట్రెక్కింగ్ ప్రియులను ఆకర్షిస్తోంది. వారాంతాల్లో ఎక్కువ మంది ఈ కొండ పైకి ట్రెక్ ద్వారా చేరుకొంటూ ఉంటారు. ఈ కొండ శిఖరం పైకి చూరుకుంటే చుట్టూ ఉన్న ప్రాంతాలన్నీ కనిపిస్తాయి. పాకిస్తాన్ భూ భాగం కూడా కనిపిస్తుంది. గుజరాత్ లోని కచ్ దేశంలోనే అతి పెద్ద జిల్లా. ఈ ప్రాంతంలో అత్యంత ఎతైన శిఖరమే కాలో దుంగార్. సముద్రమట్టానికి 462 మీటర్ల ఎత్తులో ఉన్న కాలో దుంగార్ ను బ్లాక్ హిల్ అని కూడా అంటారు. బుజ్ కు 97 కిలోమీటర్ల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంటుంది.

 

SHARE