Home Unknown facts Yoga Narasimhaswamy Thatha Naarasimhaswamyga Ela maaradu?

Yoga Narasimhaswamy Thatha Naarasimhaswamyga Ela maaradu?

0

ఈ ఆలయం లో ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. శ్రీరాముడు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ వెలసిన ఈ స్వామికి ప్రధాన గర్భాయలంతో పాటుగా ఇంకా రెండు గర్భగుడులు ఉండటం విశేషం. అయితే ఇక్కడ వెలసిన నరసింహుడికి తాతయ్య అనే పేరు ఉందని చెబుతారు. మరి ఉగ్రరూపుడైన ఆ స్వామిని తాతయ్య అని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయానికి సంబంధించి స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.narasimha swamyఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, ఒంగోలు పట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో శింగరకొండ అనే గ్రామంలోని కొండపైన శ్రీ వరాహ నరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ఐదు అంతస్థుల గాలిగోపురంతో నిర్మించబడింది. ఆలయంలోని గర్బాలయంనందు స్వామివారు దివ్యతేజ రూపంతో దర్శనమిస్తాడు. ఇంకా ప్రధానాలయానికి ఇరువైపులా మరో రెండు గర్భాలయాలు ఉన్నాయి. దక్షిణం వైపు శ్రీ లక్ష్మీదేవి, ఉత్తరం వైపున శ్రీ ఆండాళ్ అమ్మవారు కొలువై ఉన్నారు. ఇక ఈ ఆలయం 1526 వ సంవత్సరంలో విజయనగర రాజులచే నిర్మించబడింది.ఈ ఆలయ స్థలపురాణానికి వస్తే, శ్రీరామచంద్రుడు యోగనిద్రలో నృసింహ తేజం పొంది వరాహ లక్ష్మీనరసింహస్వామిని ఈ కొండపై ప్రతిష్టించాడని చెబుతారు. మరో కథనానికి వస్తే, పర్ణశాలలో దేవరుషి నారద మహాముని తపమాచరించి నృసింహ స్వామిని ప్రసన్నం చేసుకోగా ఆయన కోరిక మేరకే యోగానంద నరసింహస్వామిగా సింగరాయకొండలో వెలిశాడని ప్రతీతి. యోగ ముద్రలో ఉన్నందున ఇక్కడ స్వామి సమక్షంలో అమ్మవారు ఉండరు అని చెబుతారు.ఇది ఇలా ఉంటె దేవాలయపు తూర్పుభాగంలో తాతగుడిలో యోగానంద లక్ష్మీనరసింహస్వామి వెలసి ఉంటాడు. ఆ స్వామికి ఆ పేరు రావడం వెనుక కూడా ఒక పురాణం ఉంది. అయితే పూర్వం కారడవిలో వెలసిన నరసింహస్వామికి గతంలో రెండు కిలోమీటర్ల దూరంలోని సోమరాజుపల్లి నుంచి అర్చకుడు వెళ్లి నిత్యం నైవేద్యం సమర్పించి వచ్చేవాడు. ఒకనాడు ఆయన అర్చన నిమిత్తం వెళుతూ తన ఆరేళ్ల పిల్లాడిని కూడా గుడికి తీసుకువెళ్లాడు. ఆ బాలుడు ఆడుకుంటుండగా నైవేద్యం పెట్టిన అర్చకుడు బిడ్డను మరచి ఆలయ తలుపులు మూసి ఇంటికి వెళ్లాడు. తరువాత గుర్తుకు వచ్చినా ఆ కారడవి ప్రాంతానికి రాత్రి పూట వెళ్లలేక పొద్దున్నే వెళ్లాడు. బిడ్డను ఏ క్రూరమృగాలో తినేసి ఉంటాయని అనుకుంటూ గుడి తలుపులు తీసిన అర్చకుడికి బిడ్డ ఆడుకుంటూ కనిపించాడు. దీంతో ఆశ్చర్యపోయిన అర్చకుడు బిడ్డను అక్కున చేర్చుకుని ఆరా తీయగా గుడిలోని తాత అన్నం పెడితే తిని ఆడుకుంటున్నానని చెప్పాడు. అలా నాటి నుంచీ యోగ నరసింహస్వామిని తాత నారసింహస్వామిగా పిలుస్తున్నారు.ఇలా ఎంతో మహిమగల ఆ స్వామి వారు కొలువు ఉన్న ఈ క్షేత్రం ద్వాదశ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది.

Exit mobile version