Home Unknown facts మీ చేతిగోర్లను బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..!

మీ చేతిగోర్లను బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..!

0
జ్యోతిష్య శాస్త్రంలో హస్తసాముద్రికానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. చేతి గీతలను బట్టి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వారు భూత, భవిష్యత్ కాలాలను గురించి తెలియజేస్తుంటారు. హస్తసాముద్రికం అంటే శరీరంపై మచ్చలు, చేతి గీతలు, గోర్ల గురించి సమగ్ర సమాచారాన్ని ఇస్తుంది. గోళ్లపై మచ్చలు, ఆకారాలు జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. జీవితంలో సంభవించే మార్పుల గురించి సమాచారాన్ని ఇస్తాయి. గోరుపై మచ్చలు భవిష్యత్తులో జీవితం ఎలా ఉంటుందో చెబుతాయి.
  • అదే విధంగా గోర్ల ఆకారం నుంచి వ్యక్తి జీవితం గురించి మీరు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఆ వ్యక్తులు ఎలా ఉంటారో కూడా మీరు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు కుటుంబం గురించి ఆతడి ఆలోచన ఏంటి? డబ్బు పరిస్థితి ఎలా ఉంటుంది? లాంటి విషయాలు సకాలంలో అర్థం చేసుకుంటే అనేక సమస్యలను నివారించవచ్చని అంటారు. మరి గోర్ల ఆకృతి ఆధారంగా వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఎలా అంచనా వేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
  • వ్యక్తి గోర్లు మొరటుగా తక్కువ ఎత్తులో ఉంటే మొరటుగా ఉన్నారని సూచిస్తుంది. ఆ వ్యక్తులు ధనిక కుటుంబంలో జన్మించినా చురుకైన ఆలోచనలు ఉండవు..అంతేకాకుండా బలహీనమైన దుష్ట స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా చిన్నగా లేదా పసుపు రంగులో గోర్లు ఉన్నట్లయితే వారు అబద్ధాలు ఎక్కువగా చెబుతారు. ఇదే సమయంలో అవసరమైతే తన కుటుంబాన్ని మోసం చేసే అవకాశముంటుంది. అలాంటి వ్యక్తిని ఎప్పటికీ నమ్మలేం.
  • హస్తసాముద్రికం ప్రకారం ఇలాంటి గోర్లు ఉన్నవారు గుండె సంబంధిత విషయాల్లో పూర్తిగా శ్రద్ధపెట్టాలి. అలాగే ఆహార, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. ఇలాంటి గోళ్ల వల్ల చాలా సందర్భాల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశముంది. ఇందుకోసం సూర్య భగవానుడికి నిత్యం నీరు సమర్పించాలి.
  • ఇక పోతే చిన్న, వెడల్పాటి గోర్లు కలిగిన వ్యక్తులు పోరాటాన్ని నమ్ముతారు. అంతేకాకుండా ఇతరులను విమర్శించడం ద్వారా ఆనందిస్తారు. అలాగే ఇతరుల పనిలో జోక్యం చేసుకోవడం వారికి అలవాటుగా ఉంటుంది. ఇదే సమయంలో చదరపు గోర్లు కలిగిన వారు కరుణ కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేసేందుకు ఎల్లప్పుడు ముందు ఉంటారు. అంతేకాకుండా ప్రవర్తన సరళంగా ఉంటుంది. వారి ప్రవర్తనతో అందరి ప్రశంసలు పొందుతారు.
  • గోర్లు వెడల్పుగ, పై భాగంలో ఇరుకుగా ఉంటే వారు ఎల్లప్పుడూ చురుకుగా ఉంటారు. పనిలో వేగంగా ఉంటారు. అయితే ప్రజలతో కలుపుగోలుతనంగా ఉండటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలాంటి గోర్లు ఉన్నవారు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. సన్నని, పొడవాటి గోర్లు ఉన్నవారు ఇతరులపై ఎక్కువగా ఆధారపడతారు. అంతేకాకుండా స్వయంగా నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడతారు. అవతలి వ్యక్తిని అనుసరించే వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు.
  • వేళ్లు గుండ్రంగా, గోర్లు తక్కువ ఎత్తులో ఉంటే అలాంటి పురుషులు, మహిళలు చాలా ప్రభావవంతంగా ఉంటారు. కుటుంబంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. సాధారణంగా కుటుంబం శక్తి వారి చేతుల్లో ఉంటుంది. పొడవాటి, పొట్టి వెడల్పాటి గోర్లు ఉన్నవారు సరైన నిర్ణయం తీసుకోవడంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారు. వారు తీసుకునే పని పూర్తయిన తర్వాత వదిలివేస్తారు. అంతేకాకుండా తమ పనిలో ఎలాంటి జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు.
  • హస్తసాముద్రికం ప్రకారం గోర్లు వెడల్పుగా, పొట్టిగా, పొడవుగా సహజంగా ఉన్న వ్యక్తులు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా దానధర్మాల విషయంలోనూ ఎల్లప్పుడూ ముందుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని విజయాన్ని సాధిస్తారు. ప్రతి విషయంలోనూ ముందుకు సాగే ధోరణి కలిగి ఉంటారు.

Exit mobile version