కరోనాతో పోటీ పడి విజృంభిస్తున్న జికా వైరస్!

కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం నుండి పూర్తిగా కోలుకోకముందే కొన్ని తరాలను ప్రభావితం చేయగల మరో వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా వైరస్‌ల శక్తి ఏపాటిదో మనుషులకు తెలిసివచ్చింది. వాటి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థంమైంది. అయితే.. ఇప్పుడు కరోనా వైరస్‌తో పాటు దేశంలోని కొన్ని నగరాలను మరో ప్రాణాంతక వైరస్ హడలెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జికా వైరస్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.

mosquitoప్రత్యేకించి కాన్పూర్‌లో కొత్తగా 30 జికా వైరస్‌ కేసులు నమోదు అయ్యాయి. అవి కూడా ఒక్క దీపావళి రోజే ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉత్తర ప్రదేశ్‌లో నమోదైన మొత్తం జికా వైరస్‌ కేసుల సంఖ్య 70 వరకూ చేరింది. ఇక ఉత్తర ప్రదేశ్‌లో మొదటి జికా వైరస్‌ కేసును అక్టోబర్‌ 24న కాన్పూర్‌లోనే గుర్తించారు. అప్పటి నుంచి ఈ జికా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ జికా వైరస్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.

ఇక బుధవారం ఒక్కరోజే భారీగా కేసులు నమోదయ్యాయి.. ఆ రోజు 25 జికా వైరస్‌ కేసులు బయటపడ్డాయి. వారిలో ఆరుగురు భారత వైమానిక దళ(IAF) సిబ్బంది సైతం ఉన్నారు. దాంతో జికా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. యాంటి లార్వా స్ప్రేయింగ్‌తో పాటు అనుమానిత రోగులను గుర్తించే పనిలో వైద్య బృందాలు నిమగ్నమయ్యాయి. రోగులను గుర్తించేందుకు ప్రత్యేక ఆరోగ్య బృందాలతో విస్తృతంగా సర్వే చేస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహిస్తున్నారు.

muscle painజికా వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండటంతో కాన్పూర్‌లో హై అలెర్ట్ కొనసాగుతోంది. ఈ జికా వైరస్‌ డెంగీ కంటే ఎక్కువ ప్రమాదకరమైందని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ.. డబ్ల్యూ హెచ్ ఓ హెచ్చరించింది కూడా. ఏడిస్ జాతి దోమల ద్వారానే జికా వైరస్ వ్యాపిస్తుంది. డెంగీ, చికున్ గన్యాలు కూడా ఈ దోమల ద్వారానే వ్యాపిస్తాయి. యుగాండాలోని జికా అనే అడవి పేరు ఈ వైరస్‌కు పెట్టారు. మొట్టమొదటగా 1947లో యుగాండాలోని ఆ అడవిలోని కోతుల్లోనే ఈ వైరస్ కనిపించింది. ఆ తరువాత 1952లో మనుషుల్లోనూ వీటిని గుర్తించారు.

mosquitoజికా వైరస్ సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు, తలనొప్పి, కళ్లు చర్మం ఎర్రబారడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 2-7 రోజుల పాటు ఇవి కొనసాగితే, నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఈ వ్యాధి మనుషుల నుంచి మనుషులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాపించొచ్చు. గర్భిణుల నుంచి పుట్టబోయే బిడ్డకూ ఇది సంక్రమించవచ్చు. దానివల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. గర్భస్రావం జరిగే ప్రమాదమూ ఉంది. చాలామందిలో బయటకు ఎటువంటి లక్షణాలు కన్పించకపోవచ్చు. కాకపోతే కొద్దిపాటి జ్వరం, వంటిపై దద్దుర్లు, కీళ్ళనొప్పులు, కళ్ళకలక (కళ్ళుఎర్రబడటం) వంటివి కనబడతాయి.

red eyesకొంతమందికి కండరాలనొప్పులు కనిపించవచ్చు. కొందరిలో తలనొప్పి ఉంటుంది. ఓకసారి వైరస్ సోకాక లక్షణాలు కనిపించటానికి కొద్ది రోజులు మొదలుకొని కొన్ని వారాలు పట్టవచ్చు. వైరస్ సోకితే అది వ్యాధికి గురైన వారి రక్తంలో కొన్ని రోజులు మొదలుకొని, కొన్నాళ్ళవరకు ఉండవచ్చు. అంటే లక్షణాలు బయటకు కనిపించకపోయినా, వ్యాధి వ్యాపింపచేసె పరిస్థితిలో వారుంటారు. వ్యాధి సోకినపుడు ఏర్పడే వ్యాధి లక్షణాలు ప్రాణాంతకం కాదు, సాధారణ తలనొప్పులు, వళ్లునొప్పులే, అయితే వ్యాధిసోకిన తర్వాత కలిగే దశలు చాలా ప్రమాదకరమైనవి. అవి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీసే ఆటో ఇమ్మ్యూన్ వ్యాధులను కలగజేయవచ్చు.

feverఆ తరువాత రోగికి గులియన్ బ్యారీ సిండ్రోమ్, మొదడు కుంచించుకుపోయే మైక్రోసెఫాలీ వంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. అందుచేత వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. అలాగే అపరిశుభ్రత కారణంగా ఈ వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశముంది. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని మన చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR