Home Life Style సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే ప్రత్యేకతలు

సంక్రాంతి అనగానే మనకి గుర్తొచ్చే ప్రత్యేకతలు

0

సంక్రాంతి :అసలు సంక్రాంతి అంటే… సంక్రమణం అని అర్థం,అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి రావటమే. ఇలా సంవత్సరానికి 12 సంక్రమణాలు ఉన్నప్పటికీ రెండు సంక్రమణాలకే ప్రాముఖ్యత ఉంది.మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటప్పుడు సంక్రమణ పుణ్యకాలమనబడుతుంది. ఇలా సూర్యుడు దక్షిణాయనంలోకి వెళ్లినప్పుడు, ఆ కాలాన్ని కలికాలం అని కూడా పిలుస్తారు. ఇలా పుణ్యకాల ప్రారంభాన్ని ఒక పండుగల జరుపుకుంటారు.ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.sankranthiసంక్రాంతి నాలుగు రోజుల పండుగ. ఈ పండుగ మొదటి రోజును ”భోగి”, అని రెండో రోజును ”మకరసంక్రాంతి” అని, మూడో రోజున ”కనుమ”, నాలుగో రోజును ”ముక్కనుమ” అంటూ జరుపుకుంటారు. వారి వారి ఆచారాలకు అనుగుణంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి వచ్చిందంటేనే గొబ్బి పాటలు, గంగిరెద్దులు, రథం ముగ్గులు, హరిదాసుల కీర్తనలు, భోగమంటలు, బొమ్మల కొలువులు, పిండి వంటలు, కొత్త దుస్తులు.. వాటిని ధరించి చూడముచ్చటగా అలంకృతమైన ఆడపడుచులు కనిపిస్తారు.
భోగి:
భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.భోగి రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు వేస్తారు. తమ తమ ఇండ్లలోని, పనికిరాని పాత చెక్క వస్తువులను, ఇతర వస్తువులను మంటలలో పడవేసి, పనికిరాని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని కోరతారు. ఈ చర్య పాత చెడు అలవాట్లని మాని కొత్త మంచి అలవాట్లని చేసుకోవాలని కూడా సూచిస్తుంది.
హరిదాసులు :
సంక్రాంతి నెలల్లో మనకు కనిపించే గొప్ప సంప్రదాయాల్లో ఒకటి హరిదాసు గానం. తెలతెలవారుతూనే ప్రత్యక్షమయ్యే హరిదాసులు చెంగు విడువరా.. కృష్ణా! నా చెంగు విడువరా.. అందముగా ఈ కథ వినరే రజతాచలసదనా.. అంటూ తలపై అక్షయపాత్ర, ఒక చేతితో చిడతలు, మరో చేత్తో తంబూరా మీటుతూ శ్రీకృష్ణ లీలామృతగానాన్ని కీర్తిస్తూ గ్రామవీధుల్లో సంచరిస్తారు.పూర్వం పల్లె, పట్టణం తేడ లేకుండా తెల్లవారుజామునే ముగ్గులు వేసే సమయానికే పురవీధుల్లో హరినామ గానం చేస్తూ.. వివిధ కీర్తనలతో హరిదాసులు అలరించేవారు. హరిదాసు అనగా పరమాత్మకు సమానం. మనుషులు ఇచ్చే ధానధర్మాలు అందుకుని వారికీ ఆయురారోగ్యాలు, భోగాభోగ్యలు కలగాలని దీవించేవారే హరిదాసులు. నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేసేందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరూ ఇచ్చే ధన, ధాన్య, వస్తు దానాలను స్వీకరిస్తారు. సూర్య భగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్రగా వారి శిరస్సుపై ధరించే పంచలోహ పాత్రగా భావిస్తారు.అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు.
ముగ్గులు: పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, పండుగ వాతావరణం నెల రోజుల ముందు నుంచే ముగ్గుల రూపంలో మనకు దగ్గిరవుతుంది.పడతులు వేసెను ముగ్గులు రంగుల హరివిల్లులా ,వీధులు మురిచేను పరిచిన పూల పందిరులులా. భోగి పళ్ళు:
భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.భోగి పులక:
కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.కోడి పందాలు:
కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు.గాలిపటాలు:
భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.ఎద్దుల పోటీలు :కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలు జరుపుతారు.బండను లాగడం, బండిని పరిగెతించటం ద్వారా ఇలా రైతులు తమ బలాబలాను పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటారు.తినుబండారాలు(వంటకాలు) : రైతులు తొలకరి పంట డబ్బులు చేతికి రావటంతో అన్నిరకాల పిండివంటకాలతో ప్రతి ఇంట్లో గుమగుమలాడే అరిసెలు ,చక్రాలు , బూందీ ,మిఠాయి ఇలా అనేకరకాల పిండి వంటకాలతో వచ్చిన అధితులకు ఆతిధ్యమిస్తారు.కనుమ:
కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.

Exit mobile version