Home Unknown facts ఆడవారికి ప్రవేశం లేని ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

ఆడవారికి ప్రవేశం లేని ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయో తెలుసా ?

0

మన దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఆడవారి ఆలయ ప్రవేశం నిషేధం పైన శబరిమల గురించి సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చిన విషయం అందరికి తెలిసిన విషయమే, అయితే ఆడవారికి ప్రవేశం లేని ఆలయాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. మరి ఆడవారికి ప్రవేశం లేని ఆ ఆలయాలు ఏంటి? ఎక్కడ ఉన్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తికేయ ఆలయం:

Karthikeya Templeహర్యానా రాష్ట్రంలో కార్తికేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామివారిని బ్రహ్మచారిగా కొలుస్తూ ఆడవారికి ఆలయ ప్రవేశం అనేది నిషేదించారు.

రానాక్ పూర్ జైన దేవాలయం:

మన దేశంలో ఎన్నో జైన దేవాలయాలు అనేవి ఉన్నాయి. అందులో ప్రసిద్ధ జైన ఆలయాలలో రానాక్ పూర్ జైన దేవాలయం ఒకటి. ఈ ఆలయం రాజస్థాన్ లోని పాలి జిల్లాలో ఉంది. అయితే రుతుస్రావం కారణంగా ఈ ఆలయంలోకి ఆడవారికి ప్రవేశం అనేది లేదు. ఇక మాములు సందర్భాల్లో కూడా ఆడవారు ఆలయంలోకి వెళ్ళడానికి చాలా నియమాలు అనేవి ఉంటాయి.

హాజీ అలీ దర్గా :

మహారాష్ట్రలోని ముంబై నగరంలో హాజీ అలీ దర్గా ఉంది. గురువారం మరియు శుక్రవారం రోజుల్లో ఇక్కడి కొన్ని వేలమంది యాత్రికులు వస్తుంటారు. ఒకప్పుడు కూడా ఈ దర్గాలోనికి ఆడవారికి ప్రవేశం అనేది లేదు. ఆ తరువాత కొందరు ముస్లిం మహిళలు ముంబై హై కోర్టుని ఆశ్రయించగా చివరకి వారికీ దర్గాలోకి ప్రేవేశం అని లభించింది.

శని శింగనాపూర్ ఆలయం:

మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయం శని దేవుని ప్రసిద్ధ దేవాలయంలో ఒకటిగా చెబుతారు. ఈ గ్రామంలో ప్రత్యేకత ఏంటంటే ఏ ఒక్క ఇంటికి కూడా గుమ్మాలు అనేవి ఉండవు. తలుపులు లేని గ్రామంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి శని దేవుని విగ్రహం శివలింగం వలె ఉండే నల్లరాతి విగ్రహం దాధాపుగా ఐదున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. అయితే ఇక్కడి విగ్రహం పైన అర్చకుని సహాయంతో తైలాభిషేకం చేసి దోష నివారణ పొందుతుంటారు. కానీ అడవు మాత్రం ఆ ప్లాట్ ఫారాన్ని తాకకూడదు అనే నియమం ఉంది. ఇలా గర్భగుడిలోకి ఆడవారికి ప్రవేశం లేదని కొందరు కోర్టుని ఆశ్రయించగా చివరగా 2016 లో గర్భగుడి ప్రవేశానికి అంగీకారం లభించింది.

అస్సాం లో ఉన్న సత్రం:

అస్సాం రాష్ట్రంలో ఉన్న పాత్ బౌసి సత్రం లోకి ఆడవారికి ప్రవేశం అనేది మొదటి నుండి కూడా లేదు. ఇలా ఆడవారికి ఇక్కడ ప్రవేశం లేకపోవడానికి కారణం ఈ ప్రదేశపు స్వచ్ఛతను కాపాడేందుకు మహిళలు ఆలయం లోపలకి అనుమతించరు అని చెబుతుంటారు. 15 వ శతాబ్దంలో సెయింట్ శ్రీమంత్ర శంకరదేవ ఈ ఆలయంలో ఈ నియమాన్ని తీసుకువచ్చారు. ఒకప్పటి ప్రధానమంత్రి అయినా ఇందిరాగాంధీని కూడా ఈ ఆలయం లోపాలకి వెళ్ళడానికి అంగీకరించలేదు.

Exit mobile version