Home Unknown facts 6 Nelalu kalipithe ekkada oka rathri anthu chikkani rahasyam

6 Nelalu kalipithe ekkada oka rathri anthu chikkani rahasyam

0

మన దేశంలో కొన్ని దేవాలయాలు సైన్సుకి అంతు చిక్కకుండా రహస్యంగానే మిగిలిపోతాయి. అలాంటి దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఈ దేవాలయం సంవత్సరంలో 8 నెలలు నీటిలోని మునిగి ఉంటుంది. మిగతా ఆ 4 నెలలు మాత్రమే దర్శనం ఇస్తుంది. అయితే 6 నెలలు కలిపి ఒకే రాత్రి అని అనడం వెనుక గల పురాణ కథ ఏంటి? అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 6 nelaluహిమాచలప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో బాతూ కీ లడీ అనే అతి ప్రాచీన ఆలయం ఉంది. మహారాణా ప్రతాప్ సాగర్ అయితే ఈ ఆలయాలు 1970లో నిర్మించిన మహారాణా ప్రతాప్ సాగర్ అనే పోంగ్ డ్యాం లో జలసమాధిలో వున్నాయి. దాదాపు 8 నెలలపాటు నీటిలోనే వుండి కేవలం 4 నెలలు మాత్రమే ఇవి మనకు కనిపిస్తాయి. పౌరాణిక కథల ప్రకారం ఈ ఆలయాలను సందర్శించటానికి సందర్శకులు అక్కడికి బోట్ లలో వెళతారు. దాదాపు 50సంవత్సరాల నుండి ఇవి నీటిలోనే మునిగి ఉన్నాయి. అయితే ఇక్కడ వారి పౌరాణిక కథల ప్రకారం ఈ ఆలయంలో స్వర్గానికి వెళ్ళే మెట్లు వున్నాయని, వీటిని 5వేల సంవత్సరాలకు పూర్వం పాండవులు అజ్ఞాత వాసంలో వున్నప్పుడు నిర్మించారని చెబుతున్నారు. ఇక పురాణానికి వస్తే, ఒక రాత్రి పాండవులు తమ అజ్ఞాత వాసంలో అనేక ప్రాంతాలలో శివఆలయాలను నిర్మించి, ఆ పరమశివుడ్ని పూజించారు. అయితే ఇక్కడ ఆలయాలతో పాటు స్వర్గానికి మెట్లమార్గాన్ని కూడా నిర్మించారని అయితే ఇది అంత సులభమయ్యింది కాదు వారు శ్రీక్రిష్ణుని భగవానుణ్ణి సాయంకోరగా శ్రీ కృష్ణుడు వారికి స్వర్గానికి మెట్ల మార్గాన్ని నిర్మించటానికి 6నెలలను ఒక రాత్రిగా మలుస్తాడు.ఇక వారు సూర్యుడినికానీ ఎలాంటి వెలుగును గానీ వారు చూడరాదని ఒక వేళ అలా గానీ జరిగితే వారు ఆ నిర్మాణాన్ని ఆపివేయాలి. లేక 6నెలలు గడువు ముగిసేసరికి వారు ఒకవేళ నిర్మాణం పూర్తి కాకపోయినా తిరిగి వారి అజ్ఞాతవాసాన్ని కొనసాగిస్తారని శ్రీకృష్ణుడు చెబుతాడు. అప్పుడు పాండవులు అందుకు అంగీకరించి నిర్మాణంలో మునిగిపోతారు.అయితే ఆ వూరిలో పనిచేసే మహిళ చాలా అర్ధరాత్రి వరకూ పనిచేస్తూ వుంటుంది.మరి తాను తన పని కోసం తెల్లవారుజామునే తిరిగి లేచి దీపాన్ని వెలిగిస్తుంది. ఆ దీపపు కాంతితో పాండవులు సూర్యోదయం కాబోతోందనిచెప్పి ఆ మెట్ల యొక్క నిర్మాణాన్ని ఆపివేస్తారు.ఆ విధంగా ఆ మెట్లు అనేవి సగంలోనే పూర్తికాకుండా ఆగిపోయాయని అక్కడివారు నమ్ముతారు.శ్రీకృష్ణుడికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాండవులు మెట్లమార్గాన్ని ఆపి వేసి తిరిగి వారి అజ్ఞాతవాసాన్ని కొన సాగిస్తారు. ఇక మహాభారత కాలంలో బాతు అనే రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయాన్ని బాతూ కీ లడీ అనే పేరు రావటం జరిగింది. ఇక్కడ 6 ఆలయాలు వుంటాయి. చిన్న ఆలయాలలో విష్ణు మొదలైన దేవతామూర్తులు వుంటారు.కానీ ప్రధాన ఆలయంలో మాత్రం పరమశివుని లింగం వుంటుంది. ఇక్కడ వున్న మరో అద్భుతం ఏంటంటే సైంటిఫిక్ గా ఆలోచించని వారిని కూడా ఆలోచనలో పడేస్తుంది. ఏంటంటే సూర్యుని యొక్క చివరి కిరణాలు అనేవి శివుడి పాదాలను తాకుతాయి. ఇక 4నెలలపాటు భూమిపై ఈ ఆలయాలు వున్నంత కాలం సూర్యుని యొక్క చివరికిరణం అనేది స్వామిని స్పృశించిన తర్వాతే సూర్యుడు అస్తమించటం జరుగుతుంది.పాండవులు నిర్మించిన ఈ దేవాలయం ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలో ఒకటిగా ఉంటూ కేవలం 4 నెలలు మాత్రమే దర్శనం ఇస్తూ పూజలు అందుకుంటుంది.

Exit mobile version