Home Unknown facts మహా ప్రాతివత్యంతో ఏకంగా సూర్యుని ఉదయించుకుండా ఆపగలిగిన స్త్రీ మూర్తి!!!

మహా ప్రాతివత్యంతో ఏకంగా సూర్యుని ఉదయించుకుండా ఆపగలిగిన స్త్రీ మూర్తి!!!

0

మన నిత్య జీవితంలో సూర్యభగవానుడి పాత్ర ఏమిటి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనిపించే దైవం. చాలామంది సూర్యభగవానుని ప్రార్థించి ఉత్తమ ఫలితాలను పొందుతారు.

సాధారణంగా సూర్యుడికి ఉన్న శక్తి ద్వారా ఎలాంటి వారినైనా అంతమొందించే శక్తి కలిగిన వాడు సూర్యుడు. అలాంటి సూర్యుని ఉదయించుకుండ ఒక స్త్రీ ఆపింది.
కొన్ని పురాణాలలో ఎంతో మంది పతివ్రతల గురించి మనం వినే ఉంటాం. అలాంటి వారిలో మనం ఎక్కువగా ఉన్న పేరు సుమతి.

sumatiసూర్యుని ఆపగలిగిన శక్తి ఈ సుమతికి ఎలా వచ్చింది. తన కథ తెలుసుకుందాం… పురాణాల ప్రకారం ప్రతిష్టానపురంలో కౌశికుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఈ కౌశికుడు పరమ కోపిష్టి, ఇతర స్త్రీ లపై ఎంతో వ్యామోహంతో ఉండేవాడు.

కానీ ఇతని అదృష్టం మేరకు ఇతనికి భార్యగా సుమతి వచ్చింది. కౌశికుడు ఎంత కోపిష్టి, సుమతి అంతా ఓర్పు కలిగినది. శాంత స్వరూపరాలు. అంతకుమించి మహా పతివ్రత అని చెప్పవచ్చు. కౌశికుడు ఎంతో చెడు తిరుగుళ్ళు పెరగడంతో అతనికి రోగం తెచ్చుకుంటాడు.

ఆ విధంగా కుష్టురోగంతో ఉన్నప్పటికీ సుమతి అతనిని వదలకుండా తనకు సేవ చేస్తూ ఉండేది.
ఇదిలా ఉండగా కౌశికుడు ఒకరోజు ఒక వేశ్యను చూశాడు. ఎలాగైనా తనను ఆమె దగ్గరకు తీసుకు వెళ్లాల్సిందిగా తన భార్యకు చెబుతాడు. అప్పుడు సుమతి తన దగ్గరికి వెళ్లి వేశ్యను ఒప్పిస్తుంది.

దీంతో సుమతి కౌశికుని తన భుజాలపై వేసుకొని వేశ్య దగ్గరకు వెళుతుండగా చీకటిలో కౌశికుడి కాలు ఒక మాండ్యమునికి తగులుతుంది. ఆ విధంగా కౌశికుడి కాలు తగలడంతో ఆ ముని నన్ను బాధించిన నీ శరీరం సూర్యోదయం అయ్యే లోపు వెయ్యి ముక్కలవుతుందని శపించాడు.

ఆ ముని శాపం విన్న సుమతి ఎలాగైనా సూర్యోదయం కాకుండా ఉండాలని కోరుకోవడంతో సూర్యోదయం కాకుండా సమస్త లోకం మొత్తం చీకటిగా ఉంటుంది. లోకమంతా చీకటి మయం కావడంతో బ్రహ్మాది దేవతలు సైతం సుమతితో తల్లి. సూర్యోదయం కాకపోవడం వల్ల లోకాలన్నీ తలకిందులు అయిపోయాయి. ఎలాగైనా నీ భర్తకు మరణం లేకుండా అతని ఆరోగ్యవంతునిగా చేస్తామని మాట ఇవ్వడంతో సుమతి తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది.

దీంతో సూర్యోదయం అయిన తర్వాత కౌశికుడు మరణిస్తాడు. వెంటనే దేవతలు అక్కడికి చేరుకొని అతనికి తిరిగి ప్రాణం పోస్తారు. దీంతో అతను నవమన్మధుడుగా మారి ఆ బ్రహ్మాది దేవతలను నమస్కరిస్తారు. ఈ విధంగా సుమతి తను మహా ప్రాతివత్యం ద్వార ఏకంగా సూర్యుని ఉదయించుకుండ ఆపగలిగింది.

Exit mobile version