Home Unknown facts శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయంలోని ఆశ్చర్యాన్ని గురి చేసే విషయాలు

శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయంలోని ఆశ్చర్యాన్ని గురి చేసే విషయాలు

0

మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాలలో రహస్యాలు ఇప్పటికి అంతుచిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. అలా మిస్టరీగా మిగిలిన ఆ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న మెట్లు ముట్టుకుంటే ఏడు రకాల శబ్దాలని చేస్తాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో మరిన్ని ఆశ్చర్యకర విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Airavateswarar Temple Darasuram

తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, కుంభకోణానికి సుమారు 4 కి.మీ. దూరంలో ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయాలు 11 వ శతాబ్దానికి చెందినవిగా తెలియుచున్నది. ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాలు కూడా గొప్ప శిల్పకళా సంపదతో నిర్మించబడినాయి. ఈ రెండు ఆలయాలు ఒకటి స్వామివారిది, ఒకటి అమ్మవారిది. ఈ ఆలయంలో స్వామివారి పేరు రాజరాజేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి.

ప్రసిద్ధ హిందూదేవాలయంగా ప్రసిద్ధి గాంచిన ఈ ఆలయం 12 వ శతాబ్దానికి చెందినది కాగా, రాజారాజా చోళుడు ఈ ఆలయాన్ని నిర్మిచినట్లుగా చెబుతారు. ఇక ఈ ఆలయంలో శివుడు పూజలందుకొనుచుండగా, ఇక్కడి స్వామికి ఐరావతేశ్వరస్వామి అని పేరు రావడానికి కారణం, ఇంద్రుడి వాహనమైన ఐరావతం తెలుపు రంగుల ఉంటుంది. అయితే ఒకసారి దుర్వాస మహర్షి ఆగ్రహానికి గురై ఐరావతాన్ని శపించగా తన తెలుపు రంగుని కోల్పోతుంది. అప్పుడు ఐరావతం ఈ శివాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న స్వామిని పూజించి కోనేరులో స్నానం చేయగా తన రంగుని తిరిగి పొందుతుంది. అందుకే ఈ ఆలయానికి ఐరావతేశ్వర ఆలయం అనే పేరు వచ్చినదని పురాణం.

ఈ ఆలయ విషయానికి వస్తే, ఆలయ ద్వారం వద్ద రాయితో చేసిన మెట్లు ఉండగా వాటిని తాకితే ఏడూ రకాల శబ్దాలను చేస్తాయి. అంటే సప్తస్వరాలు వినిపిస్తాయి. ఇలా రాయిని తాకితే సంగీతం ఎలా వినిపిస్తుంది, దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటనేది మాత్రం ఇప్పటివరకు ఎవరుకూడా చెప్పలేకపోయారు. ఈ ఆలయం ప్రకారం లోపలకు వెళ్ళడానికి ఆలయ ప్రకారం బయటవైపున గోపుర ద్వారానికి ఎదురుగా రెండు చిన్న మండపాలు ఉన్నాయి. అందులో ఒకదానిలో నంది విగ్రహం ఉంది. అయితే ప్రతి ఆలయంలో నంది విగ్రహం ఆలయ ప్రకారంలోపలనే స్వామివారికి ఎదురుగా ఉంటుంది. కానీ ఈ ఆలయంలో ప్రకారం బయట నంది విగ్రహం ఉండటం విశేషం.

ఇంకా ఈ ఆలయం వద్ద కోనేరుని యమతీర్థం అని పిలుస్తారు. ఇలా పిలవడం వెనుక కారణం ఏంటంటే, ఒకసారి యముడికి ఒక మహర్షి శాపం పెట్టగ ఒళ్లంతకుడా మాటలు మండుతున్నట్లుగా అనిపిస్తుండగా ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని ప్రార్ధించి మంటలను పోగొట్టుకున్నాడు. అందుకే ఈ కోనేరుని యమతీర్థం అని పిలుస్తుంటారని పురాణం.

ఈ ఆలయ గోడమీద ఎక్కడ ఖాళీ అనేది లేకుండా చక్కని శిల్పాలు చెక్కబడినవి. ఈ గోడల గూళ్ళలో వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్టించబడి ఉన్నాయి. ఈ గూళ్ళకి రెండు పక్కల చోళ చక్రవర్తుల రాజలాంఛమైన సింహపు ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయం యునెస్కో వారి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.

Exit mobile version