Home Unknown facts బ్రహ్మదేవుడు 9 రూపాల్లో దర్శనమిచ్చే అద్భుత ఆలయం గురించి తెలుసా?

బ్రహ్మదేవుడు 9 రూపాల్లో దర్శనమిచ్చే అద్భుత ఆలయం గురించి తెలుసా?

0

త్రిమూర్తులలో ఒకరు బ్రహ్మదేవుడు. తల రాతను రాసె ఆ బ్రహ్మ దేవుడికి తప్ప మిగతా అందరి దేవుళ్ళకి ఆలయాలు అనేవి ఉన్నాయి. అయితే ఒక శాపం కారణంగా బ్రహ్మకి ఆలయాలు అనేవి లేవని పురాణాలూ చెబుతున్నాయి. కానీ ఈ ఆలయం లో విశేషం ఏంటంటే బ్రహ్మ దేవుడు వేరు వేరు 9 రూపాల్లో దర్శనమిస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారి 5 వ శక్తిపీఠం కూడా ఉన్నదీ. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

bramhaతెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్‌ జిల్లా, అలంపురం మండలం లో తుంగభద్రానది తీరంలో వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం జోగులాంబదేవి ఆలయం. ఈ ఆలయం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా బావించబడుచున్నది. దేశంలోని 18 శక్తి పీఠాలలో 5 వ శక్తి పీఠం ఈ జోగులాంబదేవి ఆలయం. జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం ఇక్కడ బ్రహ్మ దేవుడు శివుడి కోసం తపస్సు చేసాడని చెబుతారు. ఇంకా బ్రహ్మ దేవుడు శివుడి కోసం తపస్సు చేసి ఇక్కడ తొమ్మిది శివలింగాలు ప్రతిష్టించగా అవే బ్రహ్మ రూపంలో పూజలందుకుంటున్నాయని పురాణం.

ఇక్కడ ప్రధాన శివాలయమైన బాల బ్రహ్మేశ్వరాలయంతో బాటు, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారకబ్రహ్మ, గరుడబ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ ఆలయాలు ప్రత్యేకంగా ఉండటం, ఇక్కడ క్షేత్ర పవిత్రతను మరింత పెంచాయి. ఈ శివాలయాలపై ఉన్న అనేక శిల్పాలు పౌరాణిక గాథలతో కూడి ఒక అద్భుత ప్రపంచాన్ని మనకు దృశ్యమానం చేస్తాయి. ఎందరెందరో దేశ విదేశ చరిత్రారులకు స్ఫూర్తినిచ్చేవిధంగా ఈ దేవాలయాల నిర్మాణం జరిగింది.

ఇది ఇలా ఉంటె, 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన దేవాలయం ధ్వంసం అయినందువల్ల అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు. ఇంకా అనేక ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని పారగొట్టి దేవాలయాల్ని రక్షించాడు.

ఈవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version