వినాయకుడికి సాధ్యం కానిది లేదు. వినాయకుడంటే అన్నీ. సమస్తం ఆయన ఆధీనంలోనే వుంటాయి. కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెబుతారు. మహావిష్ణువు దశావతార రూపుడయితే, విఘ్నేశ్వరుడు అంతకన్నా ఎక్కువ రూపాలను కలిగిన దేవుడు. ఒక్కో రూపం ఒక్కో మహిమ చూపుతాడట వక్రతుండుడు. కోటి సూర్యులకు సమమైన గణపతికి వీలు లేని కార్యం లేదు. ఈ చరా చర సృష్టిలో.. వినాయకుడికి సాధ్యం కానిది లేదంటారు గణేశశక్తిని ఆరాధించేవారు. అంతటి ఘనుడు కాబట్టే ఎవరు ఎలా కొలిచినా, ఎవరు ఎలా పిలిచినా విగ్నాలు దూరం చేసి శుభాన్ని, లాభాన్ని అందిస్తాడు.
- బాల గణపతి
- భక్తి గణపతి
- ధుంధి గణపతి
- దుర్గా గణపతి
- ద్విజ గణపతి
- ద్విముఖ గణపతి
- ఏకదంత గణపతి
- ఏకాక్షర గణపతి
- హరిద్ర గణపతి
- హీరాంబ గణపతి
- క్షిప్ర గణపతి
- క్షిప్ర ప్రసాద గణపతి
- లక్ష్మీ గణపతి
- మహా గణపతి
- నృత్య గణపతి
- రుణమోచన గణపతి
- సంకటహర గణపతి
- శక్తి గణపతి
- సిద్ధి గణపతి
- సింహ గణపతి
- సృష్టి గణపతి
- తరుణ గణపతి
- త్రిముఖ గణపతి
- త్య్క్షర గణపతి
- ఉచ్ఛిష్ట గణపతి
- ఉద్దండ గణపతి
- ఊర్ధ గణపతి
- వరద గణపతి
- విఘ్న గణపతి
- విజయ గణపతి
- వీర గణపతి
- యోగ గణపతి
అయితే వినాయకున్ని 32 పేర్లతో కొలిచినా.. భక్తులు మాత్రం ఆయనను పిలవడానికి మరో 10 పేర్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అవేమిటంటే…
- ఏకదంత (ఒక్కటే దంతం ఉన్నవాడు)
- లంబోదర (కుండలాంటి పొట్ట కలవాడు)
- విఘ్ననాశ లేదా విఘ్నేశ్వరుడు (పనుల్లో అవరోధాలు ఏర్పడకుండా చూసేవాడు)
- వినాయక (అన్ని నాయకత్వ లక్షణాలున్న నాయకుడు)
- గణనాథుడు (అన్ని గణాలకు అధిపతి)
- గజానన (ఏనుగు లాంటి ముఖం కలవాడు)
- దేవదేవ (అందరు దేవుళ్లకు దేవుడు)
- ఓంకార (సరైన జీవితాన్ని ఇచ్చేవాడు)
- అద్వైత (ఏకైక వ్యక్తిత్వం ఉన్నవాడు)
- అవనీషుడు (ప్రపంచాన్ని ఏలే వాడు)
అందుకే ‘గణపతి బప్పా మోరియా’ అని భక్తులు అంటారు. ఈ కథను చెప్పేవారికి, వినే వారికి, చదువేవారికి శ్రీమోరేశ్వరానుగ్రహం చేత సమస్త కోరికలు ఫలిస్తాయి. ధన సంపత్తి, యశస్సు ప్రాప్తిస్తుంది. మోర్గాం పూణేకు 79 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.