Home Unknown facts కేదార్‌నాథ్ లో ఉన్న స్వర్గా రోహణ పర్వతం గురించి కొన్ని నిజాలు

కేదార్‌నాథ్ లో ఉన్న స్వర్గా రోహణ పర్వతం గురించి కొన్ని నిజాలు

0

ఉత్తరాంచల్ రాష్ట్రం లో కొన్ని పవిత్ర క్షేత్రాలు ఉన్నాయి. అందుకే దీనిని దేవభూమి అని పిలుస్తారు. ఈ రాష్ట్రంలోని ఘర్ వాల్ ప్రాంతంలో నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అవి గంగోత్రి, కేదార్ నాథ్, బదరీనాధ్, యమునోత్రి . ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అంటారు. అయితే కేదార్‌నాథ్ యాత్రలో భాగంగా చూడవలసినవి ఈశానేశ్వర్ మహాదేవ్ ఆలయం, ఆదిశంకరాచార్యుని సమాధి, అగస్త్వేశ్వర మందిరం, రేతకుండము, దూద్ గంగ, పంచ పర్వతాలు, బుగ్గ ఆలయం. మరి పంచపర్వతాలు అని చెప్పబడే రుద్రా హిమాలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Rudra himalayaకేదార్ నాథ్ హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. అయితే కేదార్నాథ్ ఆలయానికి వెనుకగా సుమారు 2 కి.మీ. దూరంలో అడ్డంగా పరుచుకొని ఉన్న ఒక కొండల వరుస కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న వంతెన పక్క నుండి మందాకిని నది ఒడ్డునే, ఆ కొండల వరకు ఉన్న మార్గం కూడా చూడవచ్చు. ఆ కొండల వరుసను రుద్ర హిమాలయాలు అని అంటారు. వాటినే సుమేరు పర్వతాలు అని, పంచ పర్వతాలు అని అంటారు.

ఇవి వరుసగా రుద్రాహిమాలయం, విష్ణు పురి, బ్రహ్మపురి, ఉద్గారికాంత, స్వర్గా రోహణ అనే పేర్లు కలిగి ఉండటం వలన వీటికి పంచపర్వతాలు అనే పేరు వచ్చినది. పూర్వం పాండవులు స్వర్గానికి బయలుదేరి వెళుతూ ఉండగా, పాండవులలో ధర్మరాజు తప్ప, మిగిలిన వారందరు ద్రౌపతితో సహా స్వర్గా రోహణ అనే పర్వతం మీదనే ఒక్కొకరుగా నేలకి ఒరిగారని పురాణం.

ఈ స్వర్గా రోహణ పర్వతానికి చేరే దారిలోనే మహాపంత్ అనే ఒక చిన్న శిఖరం ఉండగా, ఈ శిఖరం దాటితే స్వర్గా రోహణ పర్వతం కనిపిస్తుంది.

Exit mobile version