Home Unknown facts Ascharyanni Kaliginche Agni Devalayam

Ascharyanni Kaliginche Agni Devalayam

0

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాలలో ఆశ్చర్యానికి గురి చేసే కొన్ని సంఘటనలు ఉంటాయి. అలంటి వాటిలో మనం ఇప్పుడు చెప్పుకొనే ఆలయం ఒకటి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలో అగ్ని జ్వాలా అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ ఆలా నిరంతరం అగ్ని ఎందుకు వస్తుంది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. Agni Devalayamప్రాచీన పర్షియా అని పిలువబడే ఇప్పటి ఇరాన్ లోని అజర్‌బైజాన్‌ బాకులోని సురగ్జని లో అటెస్‌గాహ్‌ అనే గుడి ఉంది. గుడిలో మనమైతే దీపం వెలిగిస్తాం. కానీ ఈ ఆలయంలో మాత్రం దీపం వెలిగించకుండానే మంటలు ఎగసిపడుతుంటాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వందల ఏళ్ల నుంచి ఆ అగ్ని జ్వాలా వస్తుందంటా. ఆ అగ్ని కారణంగానే ఆ గుడి ఎక్కువగా ప్రాముఖ్యతని సంతరించుకొంది. గుడి విషయానికి వస్తే జొరాష్టర్ స్థాపించిన మతము పేరు జొరాస్ట్రియన్ మతము. వీరు భగవంతుణ్ణి అహూరా మజ్దా అని పిలుస్తారు. వీరి పవిత్ర గ్రంథం జెండ్ అవెస్తా. ఈ దేవాలయాన్ని అగ్ని దేవాలయం లేదా ఫైర్ టెంపుల్ లేదా అగియారీ అని పిలుస్తుంటారు. జొరాస్త్రియన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రియన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. ఇలా వీరు కట్టిన దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారతదేశం లో ఇప్పటికి మిగిలియున్నాయి. అయితే మండపంలా ఉండే ఈ ఆలయ మధ్యంలో ఎప్పుడూ ఎగిసిపడుతున్న జ్వాలలు కనిపిస్తాయి. అయిదు త్రిభుజాకారాలతో ఉండే ఈ గుడి గుమ్మటాలపైనా ఆ మంటల వెలుగులుంటాయి. అందుకే దీన్ని ఫైర్‌ టెంపుల్‌ అని పిలుస్తారు. అటాష్‌ అంటే పర్షియన్‌ భాషలో మంట అని అర్థం. ఇక దీని చరిత్ర విషయానికి వస్తే వందల ఏళ్ల క్రితం ఇక్కడ భూమి నుంచి మంటలు వస్తూ ఉండేవి. దీంతో స్థానికులంతా దేవుడి మాయగా భావించి ఇక్కడ పూజలు చేసుకునేవారు. తర్వాత 17, 18 శతాబ్దాల్లో ఇక్కడికి వచ్చిన హిందూ వ్యాపారులు ఇక్కడే గుడిని కట్టారు. దీంతో దీని ప్రాముఖ్యత మరింత పెరిగిందిట. జొరాస్ట్రియన్లు, హిందువులు దీన్ని పవిత్ర ప్రార్థనా స్థలంగా విశ్వసిస్తారు. ఈ గుడిలో మంటలకు అసలు కారణం ఏంటంటే భూగర్భంలో ఉన్న సహజ వాయువులు బయటకు వచ్చి ఆక్సిజన్‌తో కలవడంతో మంటలు వస్తున్నాయని చెబుతున్నారు. కొన్నేళ్లకు లోపలున్న సహజవాయువులు తగ్గిపోవడంతో మంటలు అంతగా రాలేదట. దాంతో స్థానికులంతా దేవుడికి కోపం వచ్చిందని అనుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహజవాయువులు తగ్గిపోయినా పవిత్రతకు గుర్తుగా భావించే ఆ మంటల్ని కృత్రిమంగా ఏర్పాటు చేస్తూ మండిస్తున్నారు. దైవ మాయానో లేదా ప్రకృతి మాయో తెలీదు కానీ అక్కడి ప్రజలు మాత్రం ఇప్పటికి ఆ అగ్నిని దైవంగా కొలుస్తూ ఆ స్థలాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంటారు.

Exit mobile version