Home Unknown facts Athipedha a shivalinganii endala mallikarjunudu ane peru endhuku vachindhi?

Athipedha a shivalinganii endala mallikarjunudu ane peru endhuku vachindhi?

0

పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది. మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.shiva lingamఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు అనే పెద్ద శివలింగం కలదు. ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటిది ఏది లేదు. అతిపెద్ద ఈ శివలింగం గర్భగుడిలో ఎప్పుడు ఎండ తాకిడిని నిలిచి పైకప్పు లేదు కాబట్టి ఎప్పుడు ఎండలోనే ఉంటుంది. అందుకే ఈ స్వామిని ఎండల మల్లికార్జునుడు అని పిలుస్తారు.ఈ ఆలయంలోని శివలింగం ఎత్తు సుమారు 20 అడుగులు. శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం పక్కనే మరొక చిన్న శివలింగం ఉంది. ఈ లింగానికి సంబంధించి ఒక పురాణ కథ కూడా ఉంది. రావణ సంహారం తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా లంక నుండి అయోధ్యకు వెళుతూ రావివలసలోని శివుడిని పూజించినట్లు ప్రతీతి. ఈ గుడిపక్కన ఉన్న కొలనును సీతాకుండం అంటారు. ఇందులో స్నానం ఆచరించి ఆ శివలింగాన్ని దర్శించి శ్రీరాముడు సీతాలక్ష్మణ హనుమంతులతో కలసి పూజించి వెళ్లారట.ఆ తరువాత ద్వాపరయుగంలో పాండవులు తమ అజ్ఞాత వాసంలో కొంతకాలం ఈ శివలింగాన్ని పూజించినట్లు తెలుస్తుంది. ఇక 1870 ప్రాంతంలో టెక్కలి జమీందారు ఈ మల్లికార్జున స్వామికి ఆలయం నిర్మించగా అది కూలిపోయింది. ఆ తరువాత మరల ఆలయ నిర్మాణ పనులు ప్రయత్నిస్తుండగా స్వామి కలలో కనిపించి ఆలయం వద్దు ఎండలో ఎండి వానలో తడవడమే నా అభిష్టం, ఆ విదంగానే నేను భక్తులకు ముక్తిని ప్రసాదిస్తాను అని చెప్పాడట. అప్పటినుండి ఈ స్వామి ఎండల మల్లికార్జునుడు అని ప్రసిద్ధి చెందాడు.ఈ రావివలస గ్రామం కార్తీక కైలాసంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కార్తీకమాసంలో ప్రత్యేక ఉత్సవం జరుగుతుంది. లోకకల్యాణార్థం కార్తీకమాసంలో ఈ మల్లికార్జునుడు రావివలసలో అశ్వత్థ వృక్షం కిందవుంటాడని భక్తుల నమ్మకం. అందువల్లనే రావివలస కార్తీక కైలాసంగా భక్తుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకుంది.

Exit mobile version