Home Unknown facts Bangaru, Vendi ballulu kaligina deshamlone rendava athipedda vigraham unna aalayam

Bangaru, Vendi ballulu kaligina deshamlone rendava athipedda vigraham unna aalayam

0

మన దేశంలో ఉన్న విష్ణువు ఆలయాలలో ఇది ప్రముఖమైనదిగా చెబుతారు. ఈ ఆలయాన్ని విష్ణుకంచి అని కూడా అంటారు. ఆలయంలో వెలసిన స్వామివారిని వరదరాజస్వామిగా పిలుస్తారు. ఇక్కడి ఆలయంలోని గర్భగుడిలో ఉన్న స్వామివారి విగ్రహం దేశంలోనే రెండవ అతిపెద్ద విగ్రహాంగా చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. bangaruతమిళనాడు రాష్ట్రంలోని, కాంచీపురం జిల్లా, విష్ణుకంచి ప్రాంత మందలి కరిగిరి అను ఎత్తైన గుట్ట మీద శ్రీ వరదరాజస్వామి ఆలయం ఉంది. 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఇది ఒకటి. సిద్ధాంతకర్త రామానుజులు ఈ ఆలయంలోని నివసించారని చెబుతారు. ఈ దేవాలయం 23 ఎకరాల సముదాయంలో ఉంది. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ బంగారు, వెండి బల్లులు కలవు. ఈ ఆలయం ఒక గొప్ప కట్టడం అయితే వరదరాజన్ పెరుమాళ్ ఆలయాన్ని క్రీ.శ. 1053 లో చోళరాజుల నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఆరు వందలకు పైగా ఉన్న శాసనాలు ఆలయ చరిత్రను తెలియచేస్తున్నాయి. ఈ ఆలయంలోని మండపాలను విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలు నిర్మించారు. అయితే మూడో కర్ణాటక యుద్ధంలో ఆనాటి బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామి వారిని చూసి ముగ్దుడై సమర్పించిన పచ్చల హారాన్ని నేటికీ స్వామివారి ఉత్సవ సమయంలో అలంకరిస్తారు. ఈ దేవాలయంలో వెయ్యి స్థంబాల మండపం ఉంది. ఇక్కడి వరదరాజస్వామిని కృతయుగంలో బ్రహ్మదేవుడు, తేత్రాయుగంలో గజేంద్రుడు, ద్వాపరయుగంలో బృహస్పతి, కలియుగంలో అనంతశేషుడు పూజించారని చెబుతారు. ఈ ఆలయానికి పశ్చిమవైపు న, 96 అడుగులతో 7 అంతస్తులుగా నిర్మించబడిన గాలిగోపురం ఉన్నది. గర్భాలయంలోని స్వామివారు చతుర్భుజుడై పశ్చిమ ముఖంగా కొలువుదీరినాడు. ఈ దేవాలయం ప్రాంగణంలో ఆనంద సరోవరం మరియు బంగారు తామర తటాకం ఉన్నాయి. ఆనంద సరోవరం మధ్యలో ఉన్న మండపంలో నీటిలోపల అత్తి చెక్కతో చేయబడిన అత్తి దేవత మూర్తి విగ్రహం ఉంది. ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి కోనేరులో నుంచి తీసి 40 రోజులు దర్శనానికి అనుమతి ఇస్తారు. అయితే 2019 వ సంవత్సరంలో జూన్ నెలలో అత్తి శ్రీ వరదరాజ పెరుమాళ్ ను భక్తులు దర్శనం చేసుకోవచ్చును. కంచి అనగానే మనందరికీ ముందు గుర్తొచ్చేది బంగారు, వెండి బల్లులు. ఈ ఆలయంలో రెండు బల్లి విగ్రహాలు ఉన్నాయి. ఒకటి బ్యాన్గరమ్ తోను, రెండోది వెండితోను చేయబడిన బల్లులను భక్తులు తాకుతారు. వీటికి పక్కనే సూర్య, చంద్రులు కూడా ఉన్నారు. భక్తులు వీటిని తాకడం వల్ల ఒంటిమీద బల్లిపడిన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు అనేది భక్తుల విశ్వాసం.

Exit mobile version