శ్రీ రామ రామ రామేతి… రమే రామే మనోరమే..!
శ్రీ రాముడు విళంబి నామ సంవత్సరం చైత్రశుద్ధి నవమి రోజు జన్మించాడని మన పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇదే రోజున రాముల వారి కళ్యాణం కూడా జరిపించడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే ఆనవాయితీని పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంతో పాటు మిగతా అన్ని ఆలయాలు పాటిస్తున్నాయి. రాముని కళ్యాణం.. జగత్ కళ్యాణం అని మన పెద్దలు చెబుతుంటారు. ఆ రోజు ఈ ప్రపంచాన్ని పాలించే మన తల్లిదండ్రులు లాంటి సీతారాములు ఒక్కటై సృష్టి మనుగడకు కారణం అవుతారని అంటారు. అలాంటి పవిత్ర కార్యం ప్రతి సంవత్సరం రామనవమికి దేశంలోని అన్ని రామాలయాల్లో జరుగుతోంది.
తండ్రి మాట దాటని, తల్లిని దైవంగా భావించే కొడుకులా.. తమ్ముళ్లని ప్రేమించే అన్నగా.. భార్యకి మంచి భర్తగా.. ప్రజలకు అసలైన పాలకుడిగా.. మాట ఇచ్చి తప్పని స్నేహితుడిగా రాముడు ఒక సంపూర్ణ రూపం. భగవంతుడు మనిషి రూపంలో ఈ భూమి పైకి వచ్చిన అవతారమే శ్రీరాముడి పుట్టుక. మనిషిగా బతికాడు.. మనిషిలా బాధలు అనుభవించాడు.. మనిషి ఎలా బతకాలో చూపించి మహనీయుడు అయ్యాడు.
భగవంతుడే మానవ జన్మ ఎత్తి.. ఆ జన్మకు ఏ విధంగా ఒక సార్థకత వస్తుందో నిరూపించి. ఒక మనిషి ఎలా బ్రతకాలి…ఎలా బ్రతికితే మనిషై పుట్టినందుకు ఒక అర్ధం ఉంటుంది అనేది శ్రీ రాముడికి ఉన్న ఈ పదహారు గుణాల నుండి మనం నేర్చుకోవాలి…
1. Sousheelyam
3. Dharmagnya
5. Sathyavaakyaha
7. Chaarithrenacha Koyuktaha
9. Vidwaan
11. Priyadarshanaha
13. Jithakrodaha
15. Anasuyakaha