Home Unknown facts లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టకూడని చోటు ఏమిటో తెలుసా…?

లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టకూడని చోటు ఏమిటో తెలుసా…?

0
లాఫింగ్ బుద్ధాను 10 సెకన్ల పాటు చూస్తే ఎంతటి వారికైనా అప్రయత్నంగానే నవ్వు వచ్చేస్తుంది. అందుకే ప్రజలు వీటిని ఇంట్లో ఉంచుకుంటారు. అంతేకాదు లాఫింగ్ బుద్ధా అదృష్టానికి చిహ్నమని చెబుతుంటారు.
లాఫింగ్ బుద్ధ, ఇంట్లో ఉంచినప్పుడు, ధన ప్రవాహం పెరిగి, కుటుంబ సభ్యులు అందరికీ మంచి అదృష్టం కలుగుతుందని చాలామంది నమ్ముతారు.
కొన్నిసార్లు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచే విషయంలో పాటించవలసిన నియమాలకు సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల తప్పులను చేస్తారు. దీనివల్ల అనుకూల శక్తి మరియు ప్రతికూల శక్తుల మధ్యలో సమన్వయం సాధించడానికి వారు పడే ప్రయాస వృథా అవుతుంది.
కాబట్టి లాఫింగ్ బుద్దా ని ఎక్కడ ఉంచితే ఎటువంటి ఫలితం ఉంటుంది తెలుసుకుందాం…ఇంట్లో ప్రశాంతత కరువై, కుటుంబ సభ్యుల మధ్య తరచూ కీచులాటలు మరియు వాదనలు జరుగుతున్నట్లైతే, మీ ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉండాలి. ఇది సభ్యుల మధ్య సామరస్యాన్ని మరియు మెరుగైన అవగాహనను కలిగిస్తుంది.
లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచే స్థానం మన ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబానికి చెందిన ఏ వ్యక్తికి అయినా ఉద్యోగం సాధించడంలో కష్టాలు ఎదురవుతూ ఉంటే, మీరు ఇంటికి ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టాలి. ఇలా చేస్తే, త్వరలోనే ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.
దీనితోపాటు, ఆగ్నేయ దిశలో దీనిని ఉంచడం వల్ల, ఇంట్లో డబ్బులకు కొరత ఉండదు. మీ ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీ పనిని చెడు దృష్టితో ప్రభావితం అవుతుంది అని భావిస్తున్నట్లైతే, నడిచే దారిలో ప్రతిఒక్కరి దృష్టి సులభంగా పడే ప్రదేశంలో లాఫింగ్ బుద్ధ విగ్రహంని ఉంచితే, ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇది చెడు దృష్టి యొక్క ప్రభావాలు తొలగిస్తుంది మరియు వృత్తి జీవితం మెరుగుపరచి, తద్వారా పురోగతి తీసుకువస్తుంది. ఇల్లు మరియు కార్యాలయంలో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే, రెండు చేతులు పైకి ఎత్తి ఉన్న విగ్రహాన్ని, ప్రత్యేకంగా తూర్పువైపుగా ఉంచడం వల్ల  పరిస్థితి మెరుగుపడడానికి సహాయపడుతుంది. మీరు ఇలా చేస్తే, అన్ని సమస్యలు క్రమంగా మీ దారిని వీడి, పనులన్నీ గాడిలో పడతాయి.
బిడ్డలు కలగాలంటే, పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి.
ఈ విగ్రహాన్ని వంటగదిలో లేదా బాత్రూమ్ సమీపంలో ఉంచకూడదు. ఇలా చేస్తే, ఇంట్లో అసౌకర్యాలు ఎదురవుతాయి.

Exit mobile version