Home Unknown facts Bheemudu bakaasurunni samharinchadam venuka antharyam enti?

Bheemudu bakaasurunni samharinchadam venuka antharyam enti?

0

మహాభారతంలో ఎన్నో కథలు దాగి ఉన్నాయి. ప్రతి కథ కూడా ఎంతో ఆసక్తిని కలిగించడమే కాకుండా ఆలోచించేలా చేస్తుంది. ప్రతి కథలో మంచి, చెడు మధ్య యుద్ధం చివరకు మంచి గెలుస్తుంది అనడానికి మహాభారతం ఒక ఉదాహరణగా చెపుకోవచ్చు. అయితే మహాభారతంలో బకాసురుడి గురించి వినే ఉంటారు. మరి ఆ బకాసుర రాక్షసున్ని భీముడు ఎందుకు సంహరించాల్సి వచ్చింది? మరియు ఏవిధంగా సంహరించాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. bheemuduమహాభారతంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారు బస చేయడానికి ఒక ప్రదేశాన్ని ఎంచుకోవడం కోసం చూస్తుండగా ఒక నిశ్శబ్ద గ్రామానికి చేరుకుంటారు. ఇలా చేరుకున్న పాండవులకు ఒక బ్రాహ్మణ గ్రామస్థుడు ఆశ్రయాన్ని ఇస్తాడు. అయితే ఆ బ్రాహ్మణడికి ఒక కూతురు మరియు ఒక చిన్న పిల్లవాడు ఉండేవారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత ఒక రోజు బ్రాహ్మణుడి ఇంటిలో రోదనలు వినబడ్డాయి. ఆ విషయాన్ని గమనించిన కుంతీదేవి వారి ఇంటిలోకి వెళ్ళింది. అయితే ఇంటిలోని ఆ ఇంటి సభ్యులు జీవితాన్ని నేను త్యాగం చేస్తా అంటే లేదు నేను త్యాగం చేస్తా అంటూ రోదిస్తున్నారు. అది వింటున్న కుంతీదేవికి విషయం అర్ధం అవ్వక అసలు విషయం ఏంటి అని ఆ బ్రాహ్మణుడిని అడిగింది. ప్రతి రోజు ఒక గ్రామస్థుడు ఒక బండి ఆహారంను తీసుకోని బకాసుర రాక్షసుడు దగ్గరకు తీసుకువెళ్ళాలి. అప్పుడు ఆ రాక్షసుడు ఆ గ్రామస్థుడుని మరియు ఆహారాన్ని రెండింటిని తింటాడు. ఆ విధంగా రాక్షసుడు అనేక మంది గ్రామస్తులను చంపెను. ఈ రోజు మా కుటుంబం వంతు వచ్చింది. మా కుటుంబం నుండి ఒక సభ్యుడు ఆహారం తీసుకోని వెళ్ళాలి. రాక్షసుడునకు ఆహారాన్ని అందించాలని చెప్పెను. అప్పుడు కుంతీ నా కుమారుడు భీముడు మీకు సహాయం చేయగలడు. అతను మీ కుమారుడు స్థానంలో వెళ్ళతాడు అని చెప్పెను. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, మీరు మా ఇంటిలో ఆతిధ్యం స్వీకరిస్తున్న అతిధులు మీరు మాకోసం ప్రాణత్యాగం చేయడం సరికాదు వద్దు అని చెప్పగా, అప్పుడు కుంతి దేవి నవ్వుతు మా భీముడు రాక్షసులను చంపడం కొత్త ఏమి కాదు మీరు దిగులు చెందకండి ఆహారం తీసుకొని భీముడు వెళతాడని చెబుతుంది. అయితే పాండవుల దగ్గరకు వచ్చి, కుంతీ రాక్షసుడు గురించి మరియు ఆమె చేసిన వాగ్దానం గురించి చెప్పగా భీముడు బకాసుర కోసం ఆహారం తీసుకువెళ్ళటానికి సిద్ధం అవుతాడు. ఆ తరువాతి రోజు తెల్లవారుఝామున భీముడు బియ్యం,పాలు, కూరగాయలు, పండ్లు మరియు స్వీట్లు తో కూడిన బండిని తీసుకొని బకాసురుడు ఉండే ప్రదేశానికి వెళ్తాడు. అలా భీముడు బకాసురుడు ఉన్న ప్రదేశానికి వచ్చిన చాల సమయం వరకు కూడా ఆ రాక్షసుడు రాకపోవడంతో బండిలోని ఆహారాన్ని మెల్లిగా తినడం ప్రారంభించి చివరకు బండిలోని ఆహారాన్ని అంత కూడా భీముడే తినేస్తాడు. ఇక ఆహారం అంత తినేసాక కొద్దీ సేపటికే బకాసురుడు వచ్చి గట్టిగా గర్జించి, నా ఆహారం తినటానికి ఎంత ధైర్యం నేను ఇప్పుడు ఆకలితో ఉన్నాను అనగా అప్పుడు భీముడు, దానికి నేను ఏమి చేయాలి నువ్వు రావడం ఆలస్యం అయింది నాకు ఆకలి వేస్తే నేనే తినేసాను అని చెప్తాడు. అప్పుడు మాట మాట పెరిగి ఇద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. చివరకు భీముడు తన బలంతో బకాసురుడిని వధించి అదే బండికి కట్టి గ్రామంలోకి తీసుకెళ్లి ఇక మీకు ఎలాంటి బాధలు ఉండవు సంతోషంగా ఉండండి అంటూ చెబుతాడు. ఇలా వనవాసంలో ఉన్నప్పుడు భీముడు కుంతీదేవి ఆజ్ఞతో బకాసురుడి బారి నుండి ఆ గ్రామాన్ని రక్షిస్తాడు.

Exit mobile version