హిందువుల ఆరాధ్య దైవం శివుడు. మన దేశంలో పరమశివుడు కొలువై ఉన్న ఆలయాలు లక్షల్లో ఉన్నవి. అయితే ఈ ఆలయంలో ఉన్న విశేషం ఏంటంటే, శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలోని శివలింగం భూమికి దిగువ భాగంలో అతి చిన్నదిగా ఉంటుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక ఆలయంలోని శివలింగం చాలా పురాతనమైనదిగా తెలుస్తుంది. ఈ శివలింగం చాలా చిన్నదిగా భూమికి దిగువభాగంలో ఉంటుంది. ఆలయం మధ్యలో గల గర్భాలయం కొంచెం ఎత్తులో ఉంటుంది. ఆలయంలో రెండు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. తూర్పువైపు ఉన్న ద్వారం నుండి ప్రవేశించగానే సంజీవిని పర్వతంతో కూడిన ఆంజనేయస్వామి వారు మనకి దర్శనమిస్తారు. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు దర్శనమిస్తాడు.
ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, అమర్నాథ్ లోని గుహాలయాన్ని పోలిన ఆలయం యొక్క నమూనా ఇచట ఉంది. ఈ ఆలయంలోనే మంచులింగమును కూడా మనం దర్శించవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక వృక్షమునకు అనేక గంటలు వ్రేలాడుతూ కనబడతాయి. ఈ గంటలను శిక్షణలో ఉన్న సైనికులు కట్టినట్లుగా చెబుతారు. ఈ వృక్షం క్రింద యమధర్మరాజు, దుర్గామాత విగ్రహాలు ఉన్నాయి.