Home Unknown facts Chettu modhallo velisina hanumanthudi aalaya rahasyam

Chettu modhallo velisina hanumanthudi aalaya rahasyam

0

రామ భక్తుడు అయినా హనుమంతుడు లేని గుడి ఎక్కడ ఉండదు. దైవాన్ని నమ్మే ప్రతి భక్తుడికి హనుమంతుడు అంటే ఒక నమ్మకం, ఒక దైర్యం. ఇది ఇలా ఉంటె అయన వెలసిన ఏ ఆలయంలో ఒక విశేషం ఉంది. ఇక్కడ హనుమంతుడు ఒక చెట్టు మొదట వెలసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? హనుమంతుడు అక్కడ చెట్టు క్రింద ఎందుకు వెలిసాడు అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.chettuఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని, పచ్చిమగోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెం మండలం ఎర్రకాలువ ఒడ్డున గురవాయిగూడెం అనే గ్రామం కలదు. ఈ గ్రామంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ మద్ది వీరాంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఇక్కడ ఒక మర్రిచెట్టు మొదట్లో అంజనేయస్వామి వెలసి ఉన్నాడు. అందువలన ఈ స్వామివారిని మద్ది వీరాంజనేయస్వామి అని పిలుస్తారు. ఇక ఆలయం స్థల పురాణానికి వస్తే, తేత్రాయుగంలో రావణసైన్యంలో మాద్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు రాక్షసుడిగా కాకుండా ఆధ్యాత్మిక చింతనతో జీవించేవాడు. అయితే రామ, రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో రామునివైపు పోరాడుతున్న ఆంజనేయస్వామి వారిని చూసి అతని మనసు చెలించి అస్రసన్యాసము చేసి హనుమా అంటూ తనువు చాలించాడు. ఇక అతడు ద్వాపరయుగంలో మద్వికునిగా జన్మించి సదాచార సంపన్నుడై నిత్యం భక్తి భావంతో జీవించేవాడు. విధివశాత్తు కౌరవ పాండవుల యుద్ధంలో కౌరవ పక్షమున పోరాడుతున్న మద్వికుడు, అర్జునుని జెండాపై ఉన్న శ్రీ ఆంజనేయస్వామి వారిని చూసి పూర్వజన్మ గుర్తుకు వచ్చి, హనుమా అంటూ ప్రాణ త్యాగం చేసాడు. ఇక కలియుగంలో మద్యుడిగా జన్మించి ఆధ్యాత్మిక చింతనతో జీవిస్తూ, ఎర్ర కాలువ ఒడ్డున వచ్చి తపస్సు చేసుకొనుటకు అచట నివాసం ఏర్పరుచుకున్నాడు. ప్రతి రోజు కాలువలో స్నానం చేసి స్వామివారిని పూజించేవాడు. ఒక రోజు అతడు స్నానం చేసి ఒడ్డుకి వస్తుండగా పడబోయాడు, కానీ ఎవరో ఆపినట్లు అతను ఆగిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే ఒక వానరం ఆయన చేయి పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చి, ఆయనకు సపర్యలు చేస్తున్న వానరాన్ని చూసి ఒకరోజు మధ్వుడు వానరాన్ని ఆంజనేయస్వామిగా గుర్తించి, స్వామి ఇంతకాలం మీతో పనులు చేయించుకున్నాను నేను పాపాత్ముడను నేను జీవించి ఉండుట అనవసరం అని స్వామి వారి పాదాల వద్ద పడి ఏడువసాగాడు. అప్పుడు హనుమంతుడు ప్రత్యేక్షమై, ఇందులో నే తప్పు ఏమి లేదు, నీ భక్తికి మెచ్చి నేనే స్వయంగా వచ్చి సపర్యలు చేశాను ఏదైనా వరం కోరుకో అని అన్నాడు. అందుకు మద్యుడు “మీరెల్లప్పుడు నాచెంతనే ఉండేలా వరం ఇవ్వండి” అని ప్రార్ధించాడు. అప్పుడు శ్రీ ఆంజనేయస్వామి ” నీవు ఇచట మద్దిచెట్టుగా అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో ఒక చేతిలో ఫలం మరో చేతిలో గదతో ఇచట వెలుస్తాను. ఈ పుణ్యక్షేత్రం నే పేరుతో మద్ది ఆంజనేయస్వామిగా భక్తులు పిలుస్తారని అనుగ్రహించాడు. ఈ అంజనేయస్వామి ఆలయంలో 7 మంగళవారాలు 108 ప్రదక్షిణలు చొప్పున చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

Exit mobile version