Home Unknown facts Dargah famous avvadaniki aa bandaraye karanama?

Dargah famous avvadaniki aa bandaraye karanama?

0

ఈ విశ్వంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. కొందరు సైన్స్ ద్వారా రుజువు అయితేనే వాటిని నిజం అని నమ్ముతారు. అయితే సైన్స్ మేధస్సుకు అందని ఎన్నో వింతలు విశేషాలు ఈ విశ్వంలో ఉన్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే ఆ వింతల వెనుక దేవుడు ఉన్నాడా లేదా అది ప్రకృతి వైపరీత్యమా అనేది కొన్నిటిని తేల్చడం చాలా కష్టం. అలాంటి విశేషల్లో ఒకటి ఆజ్మీర్ దర్గాలో కూడా ఉంది. మరి ఆ విశేషం ఏంటి? ఆ దర్గా ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. dargahరాజస్తాన్ లోని ఆజ్మీర్ అనే ప్రాంతంలో ఆజ్మీర్ దర్గా ఉంది. ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఈ దర్గాను దర్శించేందుకు వస్తుంటారు. ఎందుకంటే ఆజ్మీర్ దర్గాలో ఓ పెద్ద బండరాయి అందరిని ఆకట్టుకుంటుంది. దానికి కారణం ఏమిటి అంటే ఈ బండరాయి భూమి నుంచి రెండు అంగుళాల ఎత్తులో ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతూ ఉంటుంది. ఇలా ఈ రాయి గాలిలో ఎందుకు తేలుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటివరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. సైన్స్ కూడా నిరూపించలేకపోయింది. ఈ కారణంగానే దర్గా భక్తులను ఆకట్టుకుంటుందని అక్కడి బోధకులు చెప్పుతుంటారు.ఇంకా ఆజ్మీర్ దర్గాలో ప్రతిరోజూ రెండు కుండల్లో వంట చేస్తారు. బియ్యం, చిరుధాన్యాలు, నెయ్యి, చెక్కర, కుంకుమపువ్వు వంటి వాటితో ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఈ ఆహారాన్ని ఉదయం దర్గాకు వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇస్తుంటారు. అయితే ఇక్కడ కేవలం శాఖాహారం మాత్రమే వండుతారు.అంతేకాదు, ఈ దర్గా తలుపులను సంవత్సరంలో నాలుగు రోజులు మాత్రమే తెరిచి ఉంచుతారు. అది ఎప్పుడు అంటే ఉరుసు ఉత్సవం జరిగేరోజు ఒకసారి, రంజాన్ సమయంలో రెండు సార్లు, ఖ్వాజా సాహెబ్ పీర్ ఉరుసు సమయంలో ఒకసారి దర్గా తలుపులు తెరుస్తారు. ఇంతటి ఆశ్చర్యాన్ని కలిగించే గాలిలో తేలియాడే బండ ఉన్నందువలనే రాజస్థాన్ లోని ఆ దర్గాని చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు.

Exit mobile version