ఒకసారి కర్ణుడి దానగుణాన్ని అందరూ పొగుడుతూ ఉంటే అది చూసి భరించలేని అర్జునుడు, తరవాత కృష్ణుడి దగ్గరకు వెళ్లి…. ఇలా అడిగాడు. బావా! నేను కూడా దానాలు చేశాను. చెప్పాలంటే అవసరమనిపిస్తే కర్ణుడి కంటే ఎక్కువ చేస్తాను. అయినా నన్ను ఎవరూ గుర్తించటం లేదు. అందరూ కర్ణుడి దాన గుణాన్నే పొగుడుతున్నారు. అసలు దీని వెనకున్న కారణమేమిటి? అని అడిగాడు. అపుడు కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.