అన్ని మతాలలోను దేవుడు , దేవుని ఆరాధన ఉంటుంది. సాంప్రదాయాలు, కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలం, అర్ధము, పరమార్ధము, ఒక్కటే దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వం ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సాలు ఉరుములు, మెరుపులు, గాలివానలు, సునామీలు, వరదలు, చీకటి, వెలుతురు, చలి, ఎండా, వానల నుండి బయపడి అప్రయత్నాంగా ” అమ్మో, నాన్నో ” అని అరిచేవాడు. చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు.
ఆ ధైర్యం తోనే జీవం గడిపేవాడు , రక్షణ కోసం ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు. తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు. పూజించేవాడు. అమ్మ నుండే పుట్టినది ‘అమ్మోరు ‘ , నాన్న నుండి పుట్టినదే ‘నారాయణ ‘ , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది. నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వంలో రకరకాల మనుషులు , మనిషి మనిషి కి తేడా , మనసు మనసు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణం గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ. ఇలా మనిషిని పుట్టించింది, కాపుడుతున్నవి పంచభూతాలు అన్ని భగవంతుని స్వరూపంగా భావించడం హిందూ మతం లో ఉన్న గొప్పతనం.
ప్రపంచంలో ఎక్కడాలేని సర్వమత సమ్మేళనం ఒక్క భారతదేశంలోనే ఉంది. ఈ మధ్య మా మతం గొప్పది అంటే మా మతం గొప్పది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అన్నిమతాలలో ఒకే దేవున్ని పూజిస్తారు. ఒక్క హిందువులు మాత్రం ఎక్కువ దేవుళ్లను పూజిస్తారు. ఈ విషయంపై స్పదించిన నానాపటేకర్ ఈ విధంగా చెప్పుకొచ్చారు …. ఒక సమయంలో ఆంగ్లేయులు సత్య అన్వేషణ కోసం భారతదేశం వచ్చి అన్ని గ్రంధాలను శోధించారు వారు స్వయానా క్రిష్టియన్స్. అన్ని గ్రంధాలను శోధించి చివరకు రామాయణం, మాహాభాగవతం,పురాణాలూ , వేదాలు, ఉపనిషత్తులు చదివి ఎన్నో ఏళ్ల నుండి వెతికిన సత్యాన్వేషణ హిందూ సనాతన ధర్మంలో దొరికింది వారికి.
హిందూ దేవుళ్లలో అంతమంది ఎందుకు ఉంటారు అన్న సమాధానానికి ఈ విధంగా తెలియజేసారు. తల్లి తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు గరిటపట్టుకొని అన్నపూర్ణగా మారుతుంది. పిల్లలు చదువుకుంటున్న సమయంలో అమ్మ నాకు ఈ లెక్క అర్ధం అవ్వడం లేదు అంటే వెంటనే సరస్వతీదేవిగా మారి ఈ విధంగా చేయాలి అని చెబుతుంది..అమ్మ ఖర్చులకి డబ్బులు కావలి అంటే వెంటనే లక్ష్మి దేవిగా మారుతుంది. పిల్లలు తప్పు చేస్తే దండించే ఆదిపరాశక్తిగా మారుతుంది. ఇలా ఎదురుగా ఉన్న తల్లి అనేక రూపాలలో కనిపిస్తుంటే, ఈ సృష్టిని చేసిన దేవుడు తన పిల్లల అవసరాల కోసం ఎన్ని అవతారలైన దరిస్తాడు కదా!
అందుకే హిందూ మతంలో ఇంత మంది దేవుళ్ళు, దేవతలు ఉన్నారు. హిందూ ధర్మంలో ఏమిలేదు అనుకునేవారికి సరిగ్గా అర్ధం చేసుకుంటే ఫలితం తెలుస్తుంది. అది ఎలా అంటే …. మంచు చూడటానికి మనకి ఒకే విధంగా కనిపిస్తుంది కానీ మంచులో నివసించేవారు మంచులో 42 రకాలు ఉంటాయి అంటారు. కానీ దూరం నుండి చుస్తే వారికి ఒకేలా కనిపించిన దగ్గరికి వెళ్లి చుస్తే అసలు విషయం తెలుస్తోంది. ఈ విషయం బయట వారికి కాదు హిందువులలో ఉండి హిందూ మతాన్ని సరిగ్గా అర్ధం కానీ వారికి కూడా వర్తిస్తుంది. మన మతాన్ని సరిగ్గా అర్ధం చేసుకొని కాపాడే బాధ్యత మన అందరిదీ.
ప్రకృతిలో ప్రతీదాన్ని పూజించే హిందువులకు ఎందుకు అంతమంది దేవుళ్ళు అని అడిగితే అది అర్ధం లేని ప్రశ్నే అవుతుంది.