Home Unknown facts కొన్ని రాశులకి అతింద్రయ శక్తులు ఉండటానికి గల కారణాలు ఏంటి ?

కొన్ని రాశులకి అతింద్రయ శక్తులు ఉండటానికి గల కారణాలు ఏంటి ?

0

మనం పుట్టిన సమయం, తేదీ, జన్మనక్షత్రం ఆధారంగా మనది ఏ రాశి అనేది చెబుతుంటారు. జ్యోతిష్యం పైన నమ్మకం ఉండేవాళ్ళు ఈరోజుల్లు చాలా మందే ఉన్నారు. అయితే ఈ కొన్ని రాశులకి అతింద్రయ శక్తులు ఉంటాయని చెబుతున్నారు. మరి ఆ రాశులు ఏంటి? ఆలా ఉంటాయడానికి కారణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి:

Mesha Rasiఈ రాశి వారు వారికీ ఉన్న అతింద్రయ సామర్థ్యం కారణంగా తరువాత జరగబోయే పెద్ద విషయం ఏంటి అనే అంచనా వేయగలుతారు. వారి జీవితంలో వారు మరింత ముందుకు వెళ్ళడానికి తదుపరి చేయాల్సిన అతిపెద్ద పని ఏంటనే విషయం పై వారికీ ముందే తెలుస్తుంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినవారు ఎంతో నైపుణ్యం కలిగి ఉంటారు. ఇంకా చేసేది ఏదైనా ఉత్తమంగా చేయాలనీ నమ్ముతారు.

వృషభం:

ఈ రాశుల వ్యక్తులు ఎదుటి వ్యక్తుల యొక్క సరిహద్దులను మరియు వారికీ ఉన్న మానసిక లేదా శారీరక శక్తి సామర్ధ్యాలను, హద్దులను ఉత్తమంగా పసిగట్ట గలుగుతారు. ఏ వ్యక్తులైన కొద్దిగా వీరి దగ్గర కొద్దిగా వారికంటూ స్వేచ్ఛ కావాలని భావిస్తే వారు ఈ రాశివారికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఎందుకంటే వారికీ ముందే ఈ విషయం తెలిసి ఉంటుంది. వీరు ఎప్పుడైనా వరుసలో నిలుచునప్పుడు ఎదుటి వ్యక్తుల దగ్గరికి అతి సమీపానికి వెళ్ళరు. వీరు కావాల్సినంత దూరం ఉంది ఎదుటి వ్యక్తులతో వ్యవహరిస్తారు.

మిధున రాశి:

ఈ వ్యక్తులు ఆ క్షణములో ఎదురయ్యే సందర్భాలకు అనుగుణంగా ఎలాంటి విషయమైనా చెప్పడంలో సిద్ద హస్తులు. ఒక్కసారి పదాల ప్రవాహాన్ని ప్రారంభించిన తరువాత వాటి వల్ల కలిగే లాభాలు మరియు అవి చూపించే ప్రభావాలకు అసలు అంతే ఉండదు. వీరిని ఎప్పుడు ప్రజలు చుట్టూ ముట్టి ఉంటారు. వీరు ఎం చెబుతారా అనే విషయాన్నీ వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

కర్కాటక రాశి:

ఈ రాశి వారు ఎదుటి వ్యక్తుల మానసిక మరియు భావోద్వేగ స్థితిని అర్ధం చేసుకోవడంలో మంచి సామర్థ్యం ఉన్నవాళ్లు. సులభంగా చెప్పాలంటే వీరు ఎదుటి వారి భావాలను ఎంతో చక్కగా అర్ధం చేసుకోవడమే కాకుండా వారి లాగే వీరిని కూడా భావిస్తారు. వీరు జీవితాంతం ఏంటో సున్నితంగా వ్యవహరిస్తారు లేదా కారుణ్య స్వభావంతో మెలుగుతారు. ఇంకా ఎదుటి వ్యక్తులతో, తన చుట్టూ ఉన్న వ్యక్తులతో బాగోద్వేగా పరంగా దూరంగా ఉంటారు. ఇలా చేయడం వారి వల్ల కాకపోవచ్చు కానీ ఆలా చేయడానికే ప్రయత్నించాలి.

సింహరాశి:

వీరి అతింద్రయ శక్తి సామర్ధ్యాలు సమయంతో ముడి పడి ఉంటాయి. ఈ రాశివారు ఎప్పుడు నిద్రలేవడానికి అలారం పెట్టుకొనవసరం లేదు ఎందుకంటే వీరు సహజంగానే లేవాల్సిన సమయానికి లేస్తారు. వీరు సమయాన్ని చూసుకొనవసరం లేదు ఎందుకంటే వారికీ తెలుసు సరైన సమయం ఏంటనేది. వారి లోపల ఉండే గడియారం అత్యంత అధ్బుతంగా పనిచేస్తుంది. మరియు వారి జీవితంలో చోటు చేసుకోబోయే అతిపెద్ద సందర్భాల్లో వారి ఖచ్చితత్వంతో వాటిని సరైన పద్ధతుల్లో నిర్వహిస్తారు.

కన్యారాశి:

ఈ రాశి వారు అవకాశాలతో పాటు వైపరీత్యాలను కూడా పసిగట్టగలరు. ఏదైనా భూకంపం సంభవించే ముందు కానీ లేదా భీకరమైన సుడిగాలి తుఫాన్ లను ఈ రాశివారు ముందే పసిగట్టగలరు. వీరు వారి జీవితాన్ని మార్చివేసే సందర్బాలను ముందే ఉహించగలరు. మరియు రాబోయే అవతారాల నుండి తమను తాము రక్షించుకొని ఆ ప్రభావం తమపైనే పడకుండ ఉండటానికి లేదా తప్పించుకోవడానికి వారి శక్తి సామర్ధ్యాలు ఉపయోగపడతాయి.

తులా రాశి:

ఎవరితో అయినా మనం ముందుగా మాట్లాడాలి అంటే వారు మనకి ముందే తెలిసి ఉండాలి అనే నియమం ఈ తులారాశి వారి దగ్గర అసలు పనిచేయదు. అంటే దీనికి అర్ధం, వీరు ఎదుటివారితో నిగడమైన చర్చల్లో పాల్గొంటారని కాదు కానీ అంతకుమించిన అతింద్రయ శక్తి ఉందని అర్ధం. కానీ ఈ శక్తి సామర్ధ్యాలు వారి దగ్గరికి వచ్చే సరికి అంతగా పనిచేయవు. ఆ శక్తి వీరి దగ్గరికి వచ్చేసరికి ప్రభావాన్ని కోల్పోతుంది. వీరు వీరికి ఉన్న గొప్ప శక్తి సామర్ధ్యాల గురించి తెలుసుకోలేరు. అందుకే క్రమ తప్పకుండ వీరిని ముందుకు తోస్తు ఉండాలి.

వృచ్చిక రాశి:

ఈ రాశి వారు అబద్దం చెప్పేవారిని అసలు క్షమించరు. అంతేకాకుండా ఎదుటి వ్యక్తి అబద్దం చెప్పడంలో ఎంతో నేర్పరి అయినప్పటికీ వారు అబద్దం చెప్పుతున్నారనే విషయాన్ని తక్షణమే చెప్పెయ్యగలరు. వీరికి ఎవ్వరు కానీ మాయ చేయలేరు, మోసం చేయలేరు, ఆట పట్టించలేరు. వీరి తలకు ఎప్పుడు అయితే ఎదుటి వారి మాటలు వినపడతాయో ఆ క్షణమే ఎదుటి వారి మాట్లాడేది నిజామా అబద్దమా అనే విషయం తెలిసిపోతుంది. అబద్దం చెప్పేవాళ్ళు అన్న నిజాన్ని దాచే వాళ్ళన్నా లేదా అబద్దపు కథలు చెప్పేవారిని అసలు ఉపేక్షించరు. మరియు అటువంటివి వినడానికి వీరికి అసలు ఓఫిక అనేది ఉండదు.

ధనుస్సు రాశి:

ఈ రాశి వారు వీరికి కావల్సింది సులభంగా సాధించుకోవడానికి అందుకు కావాల్సిన భావ వ్యక్తీకరణ సమర్ధవంతంగా వ్యక్తీకరిస్తారు. ఈ వ్యక్తులు లాభాలను ఆర్జించడంలో అధిక శాతం విజయం సాధిస్తారు. చాలా మంది విజయం సాధించడానికి చాలా కష్టపడుతుంటారు,వ్యూహాలు రచిస్తారు, మరియు అన్ని విషయాలను వాటి ప్రాముఖ్యతల అనుగనగా విభజించి విజయ తీరాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ లక్షణాలు అన్ని ఈ రాశి వారికి సహజంగానే ఉంటాయి.

మకర రాశి:

ఈ రాశి వారు వీరికి ఉన్న అతింద్రయ సామర్ధ్యాల ద్వారా జీవిత వేగాన్ని తెలుసుకోగలుగుతారు. జీవితంలో ఎదగడానికి సరైన సమయం ఎప్పుడు అనేది వీరికి బాగా తెలుసు. ఏ సమాచారం అందుబాటులో లేనప్పుడు లేదా ఎటువంటి ఆధారాలు లభించక ముందే వీరు అందరికి కన్నా ముందే పనిని మొదలుపెడతారు. వీరి జీవితంలో సరైన సమయంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్దహస్తులు. మరియు ఒక స్థిరమైన వేగంతో విజయం అందుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలుతారు.

కుంభరాశి:

ఈ రాశి వ్యక్తుల్లో ఎదుటి వారి మనసు చదివే నైపుణ్యాలు అత్య అధ్భూతంగా ఉంటాయి.
ఈ నైపుణ్యం వీరికి సహజ సిద్దంగానే లభిస్తుంది. మరియు ఎదుటి వ్యక్తి మనసులో ఎం ఉంది అని అర్ధం చేసుకోవడానికి వీరికి ఎంతో సమయం పట్టదు. ఈ నైపుణ్యం వల్ల ఎదుటి వ్యక్తి ని సులభంగా అర్ధం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

మీనరాశి:

ఉన్నఅన్ని రాశుల్లో కళ్ళ ఈ రాశి అతింద్రయ రాశి అని చెప్పవచ్చు. మొత్తం విషయాన్ని చూడటం వీరి ప్రత్యేకత. క్లిష్టమైన సందర్భాల్లో చిక్కు ముడులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయనే విషయాలు వీరికి స్పష్టంగా తెలుసు. మరియు సరైన సమయంలో ఆ సందర్భాలను ఎలా నిర్వహించాలనే విషయం కూడా వీరికి బాగా తెలుసు.

ఈవిధంగా ఈ 12 రాశుల వారికి అతింద్రయ శక్తులు ఉండగా అన్ని రాశుల్లో కంటే మీనరాశికి వారికీ అతింద్రయ శక్తి ఎక్కువ ఉంటుందని తెలుపబడింది.

 

Exit mobile version