Home Unknown facts అత్తాకోడళ్లకు తరచు గొడవలు జరుగుతుంటే ఇలా చేయండి!

అత్తాకోడళ్లకు తరచు గొడవలు జరుగుతుంటే ఇలా చేయండి!

0
fights between mother in law and daughter

అత్తా, కోడళ్ల మధ్య సంబంధం అనగానే మన సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఒక వింత అవగాహన ఉంది. కొందరు అత్తగారంటే సూర్యకాంతాన్నే గుర్తు చేసుకుని, అలాంటి వారితో పోరు ఎప్పటికీ ఉండకూడదని భావించేవారు. అయితే ప్రతి ఇంట్లో అత్తా కోడళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉండటం సర్వసాధారణమే. ఇలాంటి గొడవలను మనం తరచు వింటూ ఉంటాం.

అయితే ఈ గొడవలకు అడ్డుకట్టవేసి, వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే శనివారం రోజు తప్పకుండా చపాతీలతో ఇవి చేయాల్సిందే. శనివారం రోజున ఇటువంటి పనులు చేయడం ద్వారా అత్తా, కోడళ్ళ మధ్య తగాదాలు సద్దుమణిగి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మరి ఆ పనులు ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం…

శనివారం ఉదయం లేవగానే నల్లటి శునకాన్ని చూసినట్లయితే ఆరోజు మనకు ధన లాభం కలుగుతుందని సంకేతం. అంతేకాకుండా నల్లటి శునకానికి శనివారం రోజున నువ్వుల నూనెతో చేసిన చపాతీలను పెట్టడం ద్వారా శని ప్రభావం మనమీద తొలిగిపోయి సుఖశాంతులతో గడుపుతారని పండితులు చెబుతున్నారు.

శనివారం ఉదయం ఎవరైనా భిక్షాటన చేస్తూ మన ఇంటి వద్దకు వస్తే వారిని విసుక్కుని తిట్టి పంపిస్తారు.
కానీ శనివారం ఒక యాచకురాలు మన ఇంటికి వస్తే చాలా శుభసూచకం. ఆ యాచకురాలు కు నల్లటి వస్త్రాలను దానం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు.

ప్రతి ఇంట్లో అత్తా, కోడళ్ళ మధ్య గొడవలు జరగడం సర్వసాధారణమే. కానీ ఆవు నూనెతో చపాతీలను చేసేటప్పుడు వాటిపై మనకు ఎవరితో అయితే గొడవ ఉంటుందో, అది అత్త కాని, లేదా కోడలు కానీ ఎవరైతే ఎక్కువ గొడవ పడుతుంటారో వారి పేరును నల్లటి సిరాతో రాసి ఆ చపాతీని నల్లటి శునకానికి పెట్టడం ద్వారా వారిద్దరి మధ్య గొడవలు సద్దుమణిగి కలిసి ఉంటారని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా శనివారం నల్లటి గోమాతను పూజించడం ద్వారా శని ప్రభావం తగ్గిపోతుంది. శనివారం భక్తిశ్రద్ధలతో శనీశ్వరుని పూజించడం ద్వారా శుభం కలుగుతుంది. శని ఎటువంటి చెడు ప్రభావానికి దారితీయడు. శని తన భక్తుల పట్ల ఎల్లప్పుడు సహృదయంతో ఉంటాడు.

Exit mobile version