Home Unknown facts టూత్ పేస్ట్ వలన ఎంత ప్రమాదం ఉందొ తెలుసా ?

టూత్ పేస్ట్ వలన ఎంత ప్రమాదం ఉందొ తెలుసా ?

0

మనం జీవిస్తున్న ఈ ఆర్టిఫిషల్ లైఫ్ లో కెమికల్స్ లేని వస్తువు వాడాలనుకోవడం అత్యాశే అవుతుంది తినే తిండిలోనే కెమికల్స్ ఉంటున్నాయి, అలాంటిది వస్తువుల్లో ఉంటే ఆశ్చర్యమేముంది. ఉదయం లేవగానే వాడే టూత్‌ పేస్ట్‌ మొదలుకొని, బాత్‌ సోప్‌ వరకు అన్నీ ప్రమాదకరంగా మారుతున్నాయి. అప్పుడప్పుడు కంపెనీలు.. తాము తయారు చేసే ఉత్పత్తుల జీవితకాలాన్ని పెంచేందుకు పలు ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తుంటారు. అవే ఇప్పుడు మనకు అనారోగ్యం తెప్పిస్తున్నాయి.

Do You Know How Dangerous Toothpasteమనం నోటి శుభ్రత కోసం వాడే టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందో లేదో కాని పరాబెన్స్ అనే కెమికల్స్ మాత్రం ఉంటున్నాయి. కేవలం టూత్ పేస్ట్ లోనే కాదు, షాంపూ, బాడి లోషన్స్, సన్ స్క్రీన్ లోషన్, ఇతర కాస్మెటిక్స్ లో కూడా పరాబెన్స్ వాడతారు. ఇప్పుడు వీటివల్ల ప్రమాదం ఏంటంటే, రొమ్ము క్యాన్సర్‌ కి, ట్యూమర్ కి కారణమయ్యే లక్షణాలు కలిగి ఉంటుందట పరాబెన్స్. ఈ కెమికల్స్‌ జంతువులకి కూడా ప్రమాదకరమని పరిశోధనలో తెలిసింది.

అదొక్కటే కాదు టూత్ పేస్ట్ లో వాడే ట్రైక్లోసన్‌ కూడా ప్రమాదకరమే దీన్ని టూత్‌పేస్ట్‌లు, బాత్‌ సోప్‌లు, హ్యాండ్‌ వాష్‌ల్లో ఎక్కువగా వినియోగిస్తుంటారు. మన శరీరంలోని నరాల వ్యవస్థను ట్రైక్లోసన్ నిర్వీర్యం చేస్తుందట. ప్రపంచ దేశాలు ట్రైక్లోసన్‌ వినియోగంతో వచ్చే అనర్థాలను ఎప్పుడో గుర్తించాయి. అందుకే చాలా దేశాల్లో వీటి వాడకాన్ని పూర్తిగా నిషేధించారు. సబ్బులు, టూత్‌పేస్ట్‌లే కాకుండా నిత్యం మనం వినియోగించే చాలా వస్తువుల్లో ట్రైక్లోసన్‌ను ‌ వినియోగిస్తున్నారు. దీని వలన గుండె, క్యాన్సర్, థైరాయిడ్ వంటి సమస్యలు వస్తాయట. అలాగే టూత్ పేస్టులో మనకు తీపిగా ఉండేందుకు అస్పర్టేమ్ అనే పదార్థం కలుపుతారు. దీని వలన లుకేమియా, లింఫోమా,బ్రెయిన్ ట్యూమర్ వంటి వ్యాధులు వస్తాయి.ఇది శరీరంలోకి ప్రవేశించగానే తలనొప్పి, చూపు మందగించడం,పార్కిన్ సన్స్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది.

ఇక టూత్ పేస్టులో నురగ రావడానికి డైతానోలమైన్ అనే కెమికల్ ని వాడుతారు. దీని వలన లివర్ మరియు కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టూత్ పేస్టులో ఉండే సార్బిటాల్ అనే కెమికల్ విరోచనాలు. అజీర్ణం, గ్యాస్, వాపును కలిగిస్తాయి. అలాగే కొవ్వును తొందరగా కరగకూడ చేస్తుంది. టూత్ పేస్టులో ట్రిక్లోసన్ అనే కెమికల్ ఉంటుంది. అంతేకాదు టూత్ పేస్టులో పాలిథిన్ ఉంటుంది. ఇది విషంతో సమానం. దీని వలన బ్రెయిన్, హార్ట్ ,కిడ్నీ దెబ్బ తింటాయి.

టీవీల్లో టూత్ పేస్ట్ రాగానే అందులో బ్రష్‌‌పై పేస్టు ఫుల్ గా పెట్టేస్తారు. కానీ, ఇంత పరిమాణంలో టూత్ పేస్టు వాడడం అస్సలు మంచిది కాదు.. ఇది ఆ టూత్‌ పేస్టు కవర్‌పై కూడా ఉంటుంది. ఎందుకంటే ఇందులోని గుణాలు పళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి అంత వాడకపోవడమే మంచిది. వాస్తవానికి రోజుకి ఓ బఠాణి గింజంత పరిమాణంలో మాత్రమే పేస్టుని ఉపయోగించాలి. దాన్ని కూడా శుభ్రంగా బ్రష్‌తో రాయాలి. ఇలా చేయడం వల్ల పళ్లు బాగా శుభ్రం అవుతాయి. ఎలాంటి సమస్యలు ఎదురుకావు.

అసలైతే మీకు అందుబాటులో ఉంటే టూత్ పేస్ట్ కి బదులు వేపపుల్లను వాడటం మంచిది. దీని వలన చాలా లాభాలు ఉంటాయి. వేపపుల్ల అందుబాటులో లేకపోతే బేకింగ్ సోడాని బ్రెష్ కు కాస్త అద్ది దానితో పళ్ళను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బేకింగ్ సోడా తో పాటు కొద్దిగా పెప్పర్ – మింట్ ఆయిల్ ను వాడితే మింట్ ఫ్లేవర్ తో ప్రెష్ ఫీల్ వస్తుంది.

దొడ్డు ఉప్పును పొడిగా చేసుకొని బ్రెష్ చేసుకుంటే చిగుళ్ల సమస్య రాదు. అలాగే దొడ్డు ఉప్పును నీళ్లలో కలిపి అందులో బ్రెష్ ను ముంచి పళ్ళు తోముకున్నప్రెష్ ఫీల్ వస్తుంది. ఒకవేళ బ్రష్ చేసుకోవడం ఇష్టం లేకపోతె ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ తో ఆయిల్ పుల్లింగ్ చేయవచ్చు. కోకోనట్ ఆయిల్ తో కూడా బ్రష్ చేసుకోవచ్చు దీని వలన యాంటీ ఫంగల్ లక్షణాలు, నోటి దుర్వాసన రాకుండా తోడ్పడుతుంది.

 

Exit mobile version