Home Unknown facts శుభకార్యాలలో, పూజాధిక్యాలలో పట్టు బట్టలు ఎందుకు ధరిస్తారో తెలుసా???

శుభకార్యాలలో, పూజాధిక్యాలలో పట్టు బట్టలు ఎందుకు ధరిస్తారో తెలుసా???

0

ఆడవారికి ఇష్టమైన వాటిలో పట్టు చీరలు ముందు వరుసలో ఉంటాయి. పట్టు చీర పేరు చెపితే మహిళలు ఆనందంతో గంతేస్తారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం పట్టుచీరకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్తగా పెళ్లి జరిగేటప్పుడు పట్టు చీర ఉపయోగిస్తారు. పూజా కార్యక్రమాలు, వ్రతాలు, ఇలాంటి వాటిలో కొత్త బట్టలు ఉపయోగించినపుడు మహిళలు ఖచ్చితంగా పట్టుచీర ఉపయోగిస్తారు. కేవలం అలంకార ప్రాయం కోసం మాత్రమే పట్టుచీర కాకుండా పట్టుబట్టలు ధరించడానికి ఒక ప్రత్యేకత ఉంది. పట్టుబట్టల వెనుకున్న ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి మరియు పూజాది కార్యక్రమాలలో మగవారు,ఆడవారు పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఆడవారికి పట్టు వస్త్రాలకు అవినాభావ సంబంధం ఉంది.

silk sareesపట్టు వస్త్రాలు ఎన్నో రంగుల్లో మరియు ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పట్టు వస్త్రాలు సమాజంలో ఉన్నత స్థితిని ,ఐశ్వర్యాన్ని సూచిస్తాయి.

అయితే పట్టు వస్త్రాలను ధరించటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఆధునిక శాస్త్రం,ధర్మ శాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఓరా అనబడే సప్త వర్ణ కాంతి పుంజం ఉంటుంది. ఇది మన శారీరక మానసిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది.

పట్టు వస్త్రాలను ధరించినప్పుడు ఈ ఓరా ఎంతో కాంతివంతంగా శక్తివంతంగా చుట్టూ ఉన్న పాజిటివ్ శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరించేలా చేస్తుంది. అందువల్ల పూజలు చేసే సమయంలోను గుడికి వెళ్లే సమయంలోను పట్టు వస్త్రాలు ధరించాలని ఆడవారికి, మగవారికి చెప్పుతారు. ఏది ఏమైనా మన సాంప్రదాయాలలో కన్పించని చాలా సైన్స్ దాగి ఉందని చెప్పవచ్చు.

Exit mobile version