Home Unknown facts కార్తికమాసంలో చేసే దీపారాధనకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా ?

కార్తికమాసంలో చేసే దీపారాధనకు ఎందుకు అంత ప్రాముఖ్యతో తెలుసా ?

0

తెలుగు సంవత్సరంలో వచ్చే ఎనిమిదో నెల కార్తీకం. చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలుస్తాడు కాబట్టే ఈ నెలను కార్తికం అని అంటారు. దీపావళి తరువాత రోజు నుండి మొదలయ్యే ఈ నెలలో ప్రతిరోజూ పర్వదినమేనని చెబుతారు.

శివకేశవులను భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ మాసంలో చేసే పూజలూ, నోములూ, వ్రతాల వల్ల ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల మొత్తం చేసే స్నానం, జపం, ధ్యానం, పూజ, దానం, దీపారాధనతో పుణ్యగతులు ప్రాప్తిస్తాయి.

కార్తికమాసంలో చేసే దీపారాధనకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఈ మాసంలో ప్రతిరోజూ మాత్రమే కాదు.. కార్తికపౌర్ణమి రోజున వెలిగించే 365 దీపాల వల్ల గత జన్మలోనే కాదు.. ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని కార్తికపురాణం చెబుతోంది.

ఈ నెలలో కుదిరినన్ని రోజులు… తెల్లవారు జామునే లేచి స్నానం చేసి.. కృత్తికా నక్షత్రం అస్తమించే లోగా తులసి కోటముందు దీపం పెడితే మంచిదని చెబుతారు. అలా ఉదయం పెట్టే దీపం విష్ణువుకు చెందుతుందనీ.. సాయంత్రం పెట్టే దీపం తులసికి చెందుతుందని చెబుతారు.

వీటన్నింటితోపాటూ కుటుంబసభ్యులూ, స్నేహితులూ కలిసి వనభోజనాలకు వెళ్లడం కూడా ఈ మాసంలో పాటించే సంప్రదాయాల్లో ఒకటి. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ పవిత్ర మాసం మొత్తం భక్తులు హరిహర నామస్మరణతో తన్మయులవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

 

Exit mobile version