Home Unknown facts శబరిమల ఆలయానికి వెళ్లలేనివారు ఇక్కడ మాల విరమణ చేస్తారట!

శబరిమల ఆలయానికి వెళ్లలేనివారు ఇక్కడ మాల విరమణ చేస్తారట!

0

అయ్యప్ప దీక్ష తీసుకున్న వారు శబరిమల ఆలయానికి వెళ్లి మల విరమణ చేస్తారు అనే విషయం మనకు తెలిసిందే. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమల దాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు. అలాంటివారికి ఒక దివ్య వరం లాంటిది ఈ ఆలయం. అసలు ఈ ఆలయం ఎక్కడుందో ఈ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Dwarapudi Ayyappa Swamy Kshetra Highlightsఅయ్యప్పస్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే. ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీక్ష పూనిన అయ్యప్పస్వాములు లక్షలాదిగా తరలివస్తుంటారు.అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ అయ్యప్పస్వామి ఆలయం ఉంది. తూర్పు గోదావరిజిల్లాలోని ద్వారపూడిలో గల ఈ అయ్యప్పస్వామి క్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ద్వారపూడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షను విరమించడం గమనార్హం. ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి తర్వాత కాలంలో అయ్యప్పస్వామి దివ్యక్షేత్రంగా దినదిన అభివృద్ధి చెందింది. ఈ ఊరిలోని అయ్యప్పస్వామి గుడిలోని విగ్రహాన్ని 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్టింపజేశారు.

అయితే ఇక్కడ ఉన్న అయ్యప్పస్వామి ఆలయానికి 1983లోనే శంకుస్థాపన జరిగింది. స్థానికంగా ఉండే ఓ తమిళ వ్యక్తి తన కోరిక నెరవేర్చినందుకుగాను అయ్యప్పస్వామికి ద్వారపూడిలో దేవాలయాన్ని కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ద్వారపూడిలోని అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణానికి బీజం పడింది.సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ హరిహరాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడి అయ్యప్పస్వామివారి దేవాలయానికి ఉన్న పద్దెనిమిది మెట్లను తమిళనాడు నుంచి తెప్పించి ఏకశిలపై నిర్మించడం విశేషం.కేరళలోని శబరిమల ఆలయాన్ని ఎంత భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారో ద్వారపూడిలోని క్షేత్రాన్ని కూడా అదే భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారు. అందుకే శబరిమలకు వెళ్ళలేని భక్తులు ఇరుముడి కట్టుకుని ద్వారపూడి క్షేత్రాన్నికి వెళ్ళి దర్శించుకుంటారు.

ద్వారపూడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక గ్రామం. ఈ గ్రామం రాజమండ్రి నగరానికి 18.6 కిలోమీటర్ల దూరంలో ఉండి, కేవలం అర్ధగంటలో(30 నిమిషాల్లో) చేరుకొనే విధంగా ఉంటుంది. రాజమండ్రి నుండి ద్వారపూడి కి ఏ పి ఎస్ ఆర్ టీ సి బస్సులు నిత్యం తిరుగుతుంటాయి. ద్వారపూడి గ్రామంలో ఫెమస్ ఏంటిది అంటే ఆది అయ్యప్ప స్వామి ఆలయమనే చెప్పాలి. అందుకే ద్వారపూడి అయ్యప్ప స్వామి పుణ్య క్షేత్రంగా వెలుగొందుతుంది. ఇక్కడున్న అయ్యప్ప ఆలయం గర్భగుడి, కేరళ లోని శబరిమలై తరహాలో అచ్చుగుద్దినట్టు ఉంటుంది.

గుడి ముఖ ద్వారంకు చేరుకోగానే ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన హరహరి (సగం శివరూపం, సగం విష్ణు రూపం) విగ్రహం కనపడుతుంది. విగ్రహం పాదపీఠం సమీపంలో వినాయక మూర్తికి చిన్న ఆలయము కూడా ఉంది. ద్వారపూడి గుడి లోపలికి వచ్చే భక్తులు మొదట గణపతి ఆలయాన్ని, ఆ తరువాత హరహరి విగ్రహాన్ని దర్శించుకుంటారు. ఈ విగ్రహాల వెనుకగా అయ్యప్పస్వామి గుడి ఉంటుంది. అయ్యప్పగుడి రెండు అంతస్తులగా ఉంటుంది. పై అంతస్తులో అయ్యప్పస్వామి మందిరం ఉంది. క్రింది అంతస్తులో వున్న మందిరంలోకి ప్రవేశమార్గం తెరచుకున్న సింహముఖరూపంలో నిర్మించారు. పై అంతస్తులో వున్న అయ్యప్పస్వామి మందిరంకు వెళ్ళడానికి రెండు మార్గాలున్నాయి ఒకటి మాల ధారణ చేసిన భక్తులు వెళ్ళడానికి 18 మెట్లున్న దారి, మాములు భక్తులు వెళ్ళడానికి మరో మార్గం ఉంది.

ఆయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా ఆంజనేయ స్వామి భారీ విగ్రహం ఉంది. అయ్యప్పగుడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. ప్రధాన ఆలయమైన అయ్యప్ప స్వామి ఆలయానికి ఎడమవైపు కింది భాగాన సాయిబాబా ఆలయం ఉంటుంది. ఇక్కడ ప్రతి గురువారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. అయ్యప్ప స్వామి ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు సాయిబాబా ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అయ్యప్ప స్వామి ఆలయానికి పక్కనే శివాలయం ఉంది. దేవాలయ ముఖద్వారం లో ఏనుగులు తోండంతో పూలహారాన్ని పట్టుకొని నిలబడి ఉన్న బొమ్మలు ఉన్నాయి. శివాలయానికి ఒక పక్క నంది విగ్రహం, ఎదురుగా నటరాజ విగ్రహం మరియు వెనకవైపున యగ్ఞాలు, యాగాలు నిర్వహించుకొనేందుకు యాగశాల ఉన్నాయి.

వెంకటేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప స్వామి ఆలయం పక్కనే ఉంటుంది. ఈ ఆలయం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆలయ గోపురాలకు నలువైపుల ఉన్న గోడలకు రంగు అద్దాలను బిగించి కట్టారు. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక పక్క గుండె చీల్చి సీతారాములను చూపిస్తున్న ఆంజనేయుని విగ్రహం ఉంది. ద్వారంపూడి బట్టల వ్యాపారానికి ఫెమస్. ఇక్కడికి పక్కనున్న జిల్లాల నుండి వ్యాపారులు వచ్చి బట్టల వ్యాపారం చేస్తుంటారు. ఇక్కడ భక్తులు, యాత్రికులు బట్టలను కొనుగోలు చేసుకోవచ్చు. గుడి బయట పూజసామాగ్రి, దేవుళ్ళ ఫోటోలు, పిల్లలు ఆడుకొనే బొమ్మలు వంటి ఆమ్మే దుకాణాలు, ఆకలి వేస్తే తినటానికి హోటళ్ళు వున్నాయి

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలనుంచేకాక ఒరిస్సానుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

Exit mobile version