Home Unknown facts కోరిన కొరికేలు నెరవేస్తూ కొండ గుహల్లో వెలసిన అనంతపద్మనాభ స్వామి ఆలయ రహస్యం

కోరిన కొరికేలు నెరవేస్తూ కొండ గుహల్లో వెలసిన అనంతపద్మనాభ స్వామి ఆలయ రహస్యం

0

ఈ ఆలయం అతి ప్రాచీన ఆలయంగా అలరాలుతుంది. ప్రకృతి అందాల నడుమ ఒక కొండ గుహల్లో ఈ ఆలయం వెలసింది. ఇక్కడి స్వామివారిని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయని, సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. మరీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ananthagiriతెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కి 72 కీ.మీ. దూరంలో, వికారాబాద్ కీ 4 కీ.మీ. దూరంలో తాండూర్ మండలం వెళ్ళు మార్గంలో ఉన్న ఎత్తైన కొండలు కలిగిన ప్రాంతమే అనంతగిరి కొండలు. దీనినే శ్రీ లక్ష్మి అనంతపద్మనాభ స్వామి దేవస్థానం అని అంటారు. ఇక్కడి కొండలు ప్రకృతి రమణీయతకు పెట్టిందే పేర్లు అన్నట్లుగా ఉంటాయి.

ఈ కొండపైన వెలిసిన శ్రీ అనంత పద్మనాభ స్వామివారు చాలా మహిమగల స్వామిగా భక్తులు భావిస్తారు. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం గోల్కొండ నవాబుల పాలనలో నిర్మించినట్లు తెలుస్తుంది. ఇంకా ఈ దేవాలయం సమీపంలో 7 గుండాలు, గుహలు, సత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ దేవాలయం సుమారు 1300 సంవత్సరాలనాటిదై ఉంటుందని చరిత్రకారుల అభిప్రాయం.

స్థల పురాణానికి వస్తే, అయితే కలియుగ ప్రారంభంలో ఇక్కడ కొండలలోని ఒక గుహలో మార్కండేయ మహర్షి తపస్సు చేస్తుండగా అయన తపస్సు మెచ్చి ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువు వరం కోరుకోమనగా అనంతుడు నరసింహస్వామి, శ్రీనివాసమూర్తుల దర్శన భాగ్యం కావాలని కోరుకున్నాడు. అతని కోరిక మేరకు స్వామివారు అనంత నారసింహ సాలగ్రామ రూపంలో వెలిశాడని, ఆ విగ్రహానికి సర్వాలంకారాలు చేస్తే శ్రీనివాసుడి రూపం కనిపిస్తుందని స్వామివారు చెప్పినట్లు స్థల పురాణం.

ఇక మార్కండేయుడు తపమాచరించిన ప్రదేశం తపోవనం గా పిలవబడుతూ అతని విగ్రహం అచట ప్రతిష్టించబడింది. అయితే ఈ ఆలయంలో గర్భగుడిలో సొరంగం ఉంది. ఇది ఇక్కడి నుండి కాశి వరకు ఉందని చెబుతారు. అయితే మార్కండేయ మహర్షి ఈ సొరంగ మార్గం నుండి కాశీకి వెళ్లి గంగాజలాన్ని తెచ్చి స్వామి వారికీ అభిషేకం చేసేవారట.

అనంతపద్మనాభ స్వామికి అత్యంత ప్రీతి పాత్రుడు హనుమంతుడు. అందువలనే గర్భాలయానికి ప్రవేశించగానే ముందు ఆంజనేయస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడి స్వామి వారి విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్ద సాలగ్రామ శిల గా చెబుతారు. ఈ శిల శిరస్సు భాగం నారసింహరూపం లోని, మధ్యభాగంలో లెక్కలేనన్ని శంఖుచక్రాల ముద్రలతో, నాగ పడగలతో అనంత పద్మనాభునిగాను కనిపిస్తుంది.

ఇక సర్వాలంకార భూషితుడైనపుడు శ్రీనివాసమూర్తిలా కనిపించే ఈ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలంటే ఉదయం 5 నుండి 6 గంటల మధ్య జరిగే అభిషేకం సమయంలో దర్శించుకోవాలి. అనంతపద్మనాభ స్వామి వారి పక్కనే లక్ష్మి అమ్మవారు దర్శనమిస్తారు. వీరి పక్కనే సీతా లక్ష్మణ సమేత శ్రీరాముడు కొలువై ఉన్నాడు.

ఇక్కడి ఆలయ ప్రాగణంలో రెండు దీపస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఒకటి పెద్దది, రెండవది చిన్నది. భక్తులు కోరిన కోరికలు తీరిన తరువాత కొండ క్రింది నుండి పై వరకు దీపారాధనలు చేస్తారు. ఇది ఇక్కడి ఆలయంలో చేస్తున్న తార తరాల ఆచారం.
ఇలా కోరిన కొరికేలు నెరవేస్తూ కొండ గుహల్లో వెలసిన అనంతపద్మనాభ స్వామి భక్తుల విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.

Exit mobile version