Home Unknown facts నీటితో దీపాన్ని వెలిగించే ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

నీటితో దీపాన్ని వెలిగించే ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0

మన దేశాన్ని పుణ్యభూమి, పవిత్ర స్థలం అని ఊరికే అనలేదు. ఎందుకంటే ప్రతి ఊర్లో ఏదో ఒక పవిత్ర ఆలయం ఉంటుంది. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు ఉన్నా అన్ని మతాల మందిరాలు కొలువు తీరి ఉన్న దేశం భారతదేశం. మన దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. అలాగే భారతీయ సంస్కృతిలో ఎందరో దేవతలు, దేవుళ్లకు సంబంధించిన కథల గురించి వినే ఉంటాం. కొన్ని ఆలయాలు… స్వయంగా దేవుళ్లే నిర్మిస్తే.. మరికొన్ని భక్తులు.. మహర్షులు నిర్మించిన ఆలయాలు ఉన్నాయి. ఇక ఇప్పటికీ అటువంటి ఆలయాలను సందర్శిస్తూనే ఉంటాం. కొన్ని ఆలయాలు ఇప్పటికీ చేధించలేని రహాస్యాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటి ఆలయమే గడియాఘాట్ మాతాజీ మందిరం.

Gadiaghat Mataji Mandirమనం తరచు గుడికి వెళుతూ ఉంటాం. గుడిలో దీపాలు వెలిగిస్తాం. దేవుడి గుడిలో దీపాన్ని వెలిగించాలంటే నూనె లేదా నెయ్యి అవసరం. కానీ ఈ గుడిలో నీటితో కూడా దీపాన్ని వెలిగించవచ్చు. మధ్యప్రదేశ్‌లోని సాజాపూర్ జిల్లా కాలీసింద్ నది ఒడ్డున ఉన్న గడియాఘాట్ మాతాజీ మందిరంలో ఈ అద్భుతాన్ని చూడవచ్చు. ఈ దీపం గత ఐదేళ్ల నుంచి నూనె, నెయ్యి అవసరం లేకుండానే నీటితో వెలుగుతోంది.

దీంతో ఈ వింత చూసేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఐదేళ్ల నుంచి ఈ దీపం ఆరకుండా వెలుగుతూనే ఉందని, దేశంలో చాలా మందిరాల్లో ఇలా ఆరకుండా వెలిగే జ్యోతులు ఉన్నా.. ఇది మాత్రం చాలా భిన్నమైనదని ఆలయ నిర్వాహకులు తెలుపుతున్నారు. ప్రమిదలో నిత్యం నూనెకు బదులు నీటిని పోస్తే చాలు.. అలా వెలుగుతూనే ఉంటుందన్నారు. ఈ ఆలయం పూజారి సిందూ సింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు ఈ జ్యోతి నూనెతోనే వెలిగేది.

అయితే, ఓ రోజు అమ్మవారు కలలోకి వచ్చి.. ఈ దీపాన్ని నీటితో వెలిగించాలని చెప్పారు. ఆమె ఆదేశాల ప్రకారం నీటితో దీపాన్ని వెలిగించాం. అప్పటి నుంచి ఈ దీపం నిరంతరాయంగా వెలుగుతూనే ఉంది’’ అని తెలిపారు. అయితే, అది కలా, నిజమా తెలియక ఆశ్చర్యపోయానని, సుమారు రెండు నెలలపాటు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు.

ఆయన ఈ విషయాన్ని గ్రామస్థులకు చెప్పినప్పుడు, వారు కూడా మొదట నమ్మలేదు, కానీ వారు కూడా దీపంలో నీరు పోసి మంటను మండించడానికి ప్రయత్నించినప్పుడు, జ్వాలలు వెలిగిపోయాయి. ఈ ఆలయం నదీ తీరంలో ఉండటం వల్ల వర్షాకాలంలో పూర్తిగా మునిగిపోతుంది. దీంతో వర్షాకాలమంతా ఆలయం మూసే ఉంటుంది. మళ్లీ నవరాత్రులకే ఈ ఆలయాన్ని తెరుస్తారు. వచ్చే వర్షాకాలం వరకు దీపం వెలుగుతూనే ఉంటుంది.

ఈ అద్భుతానికి సంబంధించిన విషయం మొత్తం అన్ని గ్రామాలకు వరకు అగ్నిలా వ్యాపించింది . అప్పటి నుండి నేటి వరకు ఈ ఆలయంలో కేవలం కాళీ సింధ్ నది నీటి ద్వారా జ్యోతి ని వెలిగించారు. దీపంలో నీరు పోసినప్పుడు అది జిగట ద్రవంగా మారి మంట పెరుగుతుందని అంటారు. స్థానిక నివాసితుల మాటల ప్రకారం, ఈ మంటవర్షఋతువులో మండదు. ఎందుకంటే వర్షాకాలంలో కాళీ సింధ్ నది నీటిమట్టం పెరగడం వల్ల ఈ ఆలయం నీటిలో మునిగిఉంటుంది, దీని వలన ఇక్కడ పూజలు చేయడం సాధ్యం కాదు. కానీ శారదా నవరాత్రులమొదటి రోజు ఘటాష్టపానంతో, వచ్చే సంవత్సరం వర్షాకాలం వరకు మండుతూ ఉన్న జ్యోతి ని మళ్లీ వెలిగిస్తారు.

 

Exit mobile version