Home Unknown facts శివుడిని బుగ్గసంగమేశ్వరస్వామి అని పిలుస్తారు ఎందుకు ?

శివుడిని బుగ్గసంగమేశ్వరస్వామి అని పిలుస్తారు ఎందుకు ?

0

మహాశివుడు కొలువై ఉన్న ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. ఈ ఆలయంలో కొలువై ఉన్న శివుడిని బుగ్గసంగమేశ్వరస్వామి అని పిలుస్తారు. మరి శివుడు ఇక్కడ ఎలా వెలిసాడు? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Shivaఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, గుంతకల్ మండలానికి కొన్ని కోలోమీటర్ల దూరంలో శ్రీ బుగ్గ సంగమేశ్వరాలయం ఉంది. శివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణకాశి అని పిలుస్తారు. ఈ స్వామి ఇక్కడ స్వయంభువు గా వెలిశాడని పురాణం.

ఇక పురాణానికి వస్తే, పూర్వం ఒక బ్రాహ్మణుడు విసుగు చెంది ఎక్కడ శాంతి దొరుకుందా అని బయలుదేరగా ఎక్కడ ఆయనికి శాంతి లభించలేదు. దీంతో వెళ్లి అయన గురువుని అడుగగా, అప్పుడు ఆ మహర్హి నేను ఒక కర్రని కాశీలోని గంగ నదిలో వదిలేస్తాను, నేను వదిలిన ఆ కర్ర నీవు పర్యటనలో ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే కనిపిస్తుందో అక్కడ నీకు తప్పకుండ శాంతి లభిస్తుందని చెప్పాడు. ఇలా గురువు చెప్పగానే బయలుదేరిన అతడికి ఈ గ్రామం చేరుకునపుడు నదిలో ఆ కర్ర కనిపించగా గురువు చెప్పిన ప్రదేశం ఇదేనని సంతోషించి ఇక్కడ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించి పూజించాడని పురాణం.

ఇక్కడ విశేషం ఏంటంటే, రెండు నీటి బుగ్గలు నిరంతం కూడా కాశీలో మాదిరిగానే ఉత్తరం నుండి దక్షిణం వైపుకి ప్రవహిస్తాయి. అందుకే ఈ ఆలయానికి శ్రీ బుగ్గ సంగమేశ్వరస్వామి అనే పేరు వచ్చినదని చెబుతారు. ఇక్కడ వందలాది మొగలి పొదలు ఉన్నవి. అయితే ఈ ఆలయానికి ఎదురుగానే ఒక ఎత్తైన కొండపైన నందీశ్వరునికి ఒక ప్రత్యేక ఆలయం అనేది ఉంది. మహానంది లో మాదిరిగానే ఇక్కడి కోనేరులో స్నానం ఆచరిస్తే సర్వరోగాలు నయం అవుతాయని భక్తుల నమ్మకం.

Exit mobile version