Home Unknown facts కుమారస్వామిని మంగళవారం రోజు పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా ?

కుమారస్వామిని మంగళవారం రోజు పూజిస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా ?

0

ప్రపంచ దేశాలలో ఉన్న దేవాలయాలలో అత్యంత ధనిక ఆలయాలుగా ఇవి ప్రసిద్ధి చెందాయి. మరి ప్రపంచంలోనే 5 ధనిక ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ అనంత పద్మనాభస్వామి ఆలయం:

కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. బిల్వ మంగలుడు అనే భక్తుడి కారణంగానే ఆ స్వామివారు ఇక్కడ వెలిశారని పురాణం. అయితే కేరళ రాష్ట్రంలో కాసర్ గోడ్ జిల్లాలోని అనంతపురం సరోవర మందిరం ఉంది. ఈ ఆలయం చుట్టూ సరస్సులతో రెండు ఎకరాల స్థలంలో ఉంది. అతిపురాతన ఆలయంలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం అంతులేని సంపదతో వార్తల్లో నిలుస్తోంది. ఆలయంలోని ఆరు నేలమాళిగలలో ఇప్పటికే ఐదు నేలమాళిగలు తెరిచారు. అందులో సుమారు ఐదు లక్షల కోట్ల ఆస్తుల వరకు కనుగొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆరో నేలమాళిగకు నాగబంధం ఉందని దానిని తెరవకూడదని అది తెరిస్తే అరిష్టం అని భక్తులు హెచ్చరిస్తున్నారు. ఇక ఒక సర్వే ప్రకారం ఈ ఆలయ ఆస్తుల విలువ 1 ట్రిలియన్ డాలర్స్ ఉంటుందని ఒక అంచనా.

తిరుమల తిరుపతి దేవస్థానం:

ప్రపంచంలో అత్యధికంగా భక్తులు తరలి వచ్చే దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. వేంకటేశ్వరుని దివ్వ సన్నిధిగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన తిరుమల కలియుగ వైకుంఠంగా విలసిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ధనిక ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. లడ్డు కౌంటర్, సేవ టికెట్స్, భక్తులు చెల్లించే అద్దె, ఇంకా భక్తులు సమర్పించే వెంట్రుకలు ఇలా అన్నిటి మూలాన దాదాపుగా తిరుమలలో ఒక్క రోజుకి 6.5 క్రోర్స్ ఆదాయం ఉంటుందని చెబుతారు. అయితే 37 వేలకోట్లు విలువ చేసే బంగారం ఈ ఆలయంలో ఉందని చెబుతారు. అంటే దాదాపుగా 52 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నాయట. భక్తులు అందించే హుండీలో సమర్పించే కానుకలో సంవత్సరానికి 3 వేల కిలోల బంగారం వస్తుందని ఒక అంచనా.

అయితే మొట్టమొదటిసారిగా వైఖాసన అర్చకుడు శ్రీమాన్ గోపీనాధ దీక్షితుల వారు శ్రీవారి మూర్తిని పుష్కరిణి చెంత, చింతచెట్టు కింద ఉన్న చీమలపుట్టలో కనుగొని, శ్రీవారి మూర్తిని ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్టించి అర్చించాడని పురాణం. తిరుమల కొండని ఆదిశేషుని శరీరంగా, దానిపై శ్రీమహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నట్లు పురాణాలూ వివరిస్తున్నాయి.

షిరిడి సాయిబాబా:

మహారాష్ట్రలోని, అహ్మద్ నగర్ జిల్లా, కోపర్ గావ్ మండలం నుండి 15 కి.మీ. దూరంలో షిరిడి పట్టణం ఉంది. పంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం షిరిడి. ఇక్కడ కొలువై ఉన్న సాయిబాబా ని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి కుల, మతం లేకుండా భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు. షిరిడి సాయిబాబాను హిందువులు, ముస్లింలు రెండు మతాల వారు పూజిస్తారు. ఎందుకంటే రెండు మతాల పద్ధతిలో అయన బోధనలు చేసాడు. సాయిబాబా యొక్క ముఖ్యమైన వాక్కు అల్లా మాలిక్, సబ్ కా మాలిక్ ఎక్. సాధువు, యోగి అయినా ఈయనను హిందువులు శివుని అవతారంగా కొలుస్తుంటారు. అయితే ధనిక ఆలయంలో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో ఒక సర్వే ప్రకారం 2013 వ సంవత్సరానికి ముందు ఒక 5 సంవత్సరాల్లోనే 1,441 కోట్ల రూపాయలు వచ్చాయట.

పూరి జగన్నాధ ఆలయం:

ఒడిశా రాష్ట్రము పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో పూరీ జగన్నాథ దేవాలయం ఉంది. నీలాద్రి అనే పర్వతం పైన ఈ ఆలయం ఉంది. పూర్వము ఈ పూరీ ని పురుషోత్తమ క్షేత్రం అని, శ్రీ క్షేత్రం అని, దశావతార క్షేత్రం అని పిలిచేవారు. పూరి జగన్నాథ రథయాత్ర కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఆలయంలో గర్భ గుడిలోని విగ్రహాలు రాతి తో చేయబడితే ఇక్కడి ఆలయంలో మాత్రం స్వామి వారి విగ్రహాలు చెక్కతో చేయబడినవి. ఇలా ఎన్నో అధ్బుతాలు ఉన్న ఈ ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో ఉన్నట్లే ఇక్కడ కూడా అంతులేని సంపద అనేది దాగి ఉంది. దానితో పాటు అనంత పద్మనాభ స్వామివారి ఆరొవ గదికి నాగబంధం ఉన్నట్లే పూరి ఆలయంలోని నాలుగవ గదికి కూడా నాగబంధం అనేది ఉంది. ఈ ఆలయంలో మొత్తం ఏడు గదులు ఉంటాయి. ఈ ఏడు గదుల్లో ఎంతో విలువైన సంపద ఉన్నది అని అందుకే 1984 లో ఆలయ అధికారులు ఆలయంలోని సంపదను లెక్కించి భద్రపరచాలని తలచి మూడు గదులని తెరిచి సంపదని లెక్కించి ఇక నాలుగవ గది దగ్గరికి వచ్చేసరికి పాము బుసలు కొడుతున్న శబ్దం విని మిగిలిన గదులు తెరవకుండా సంపద లెక్కించడాన్ని ఆపివేశారు.

సిద్ది వినాయక ఆలయం:

మహారాష్ట్రలో సిద్ది వినాయక ఆలయం ఉంది. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం శ్రీమహావిష్ణువు మధు కైటభులనే రాక్షసుడితో యుద్ధం చేసి వినాయకుడి సహాయాన్ని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కోరిక మేరకు వినాయకుడు ఆ యుద్ధ భూమిలో ప్రత్యేక్షమై విష్ణువు సహాయంతో ఆ రాక్షసుడిని సంహరించాడు. ఇలా వినాయకుడి పాద స్పర్శతో కార్యసిద్ధి కావడంతో ఈ ప్రాంతం సిద్ధక్షేత్రం అయింది. ఇలా తనకి సహాయాన్ని చేయడం చూసి ఆనందించిన శ్రీమహావిష్ణువు తానే స్వయంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి గణపతిని ప్రతిష్టించాడని స్థల పురాణం. ఈ ఆలయం ఒక ఎత్తైన కొండపైన ఉంటుంది. స్వయంభువుగా వెలసిన ఇక్కడ ఆలయంలోని స్వామివారి విగ్రహం మిగతా ఆలయాలకు భిన్నంగా స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఈవిధంగా వెలసిన స్వామివారు చతుర్భుజ గణేశుడిగా, సిద్ధివినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. సిద్ధివినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆలయాల్లో ఒకటిగావుంది. ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి 100 నుండి 120 కోట్లు ఉంటుందని చెబుతారు. ఇంకా బంగారం కూడా ఎక్కువగా విరాళాల రూపంలో రావడం గమనార్హం. ఈ ఆదాయాన్ని పలు సాంఘికసేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు.

Exit mobile version