Home Unknown facts తిరుపతి కోదండ రామాలయం గురించి కొన్ని నిజాలు

తిరుపతి కోదండ రామాలయం గురించి కొన్ని నిజాలు

0

తిరుమల తిరుపతి లో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతి రోజు భక్తులు వేలాది సంఖ్యలో వస్తుంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. తిరుమల తిరుపతి దేవస్థానానికి దగ్గరలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటిగా ఈ ఆలయం చెబుతారు. మరి ఈ ఆలయం లో ఉన్న విశేషం ఏంటి? ఈ ఆలయ స్థలపురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తిరుపతి కోదండ రామాలయంఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుమల తిరుపతిలో కోదండ రామాలయం ఉంది. ఈ ఆలయం ఆగమ శాస్ర్తానుసారంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ కోదండస్వామివారు, దక్షిణభాగంలో సీతామహాలక్ష్మీ, వామభాగంలో లక్ష్మణస్వామి స్థానక భంగిమలో ఆర్చామూర్తులుగా వెలసి భక్తులకి దర్శనమిస్తున్నారు. అయితే  వైఖానస ఆగమశాస్త్ర నియమం ప్రకారం అమ్మవారు దక్షిణభాగంలో ఉంటారు. అంటే శ్రీరాముడికి ఎడమవైపుకు కాకుండా సీతాదేవి విగ్రహం కుడివైపుకు ఉంటుంది. ఇలా కుడి పక్కన ఉండే అమ్మవారిని దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి లభిస్తుందని నమ్మకం.

ఈ ఆలయ పురాణానికి వస్తే, సీతాదేవి జాడకోసం వెతుకుతున్న శ్రీరాముడు వానరసైన్యంతో ఈ ప్రదేశానికి వచ్చాడట. అయితే ఒకప్పుడు ఈ ఆలయ ప్రాంతంలో గుహ ఉండగా, శ్రీవారి ఆనంద నిలయం నుండి దేదీప్యమానంగా వెలుగొందడం చూసి వానరులు శ్రీరామునికి తెలియచేయగా, అదంతా తిరుమల కొండ ప్రభావం అని శ్రీరాముడు వారికీ చెప్పాడట. అయితే రావణాసురుడిని సంహరించక శ్రీరాముడు తిరిగి అయోధ్యకి వెళుతూ ఇక్కడే ఒక రోజు విశ్రాంతి తీసుకున్నాడట. ఈ ఆలయాన్ని జనమేజయ చక్రవర్తి నిర్మించగా, ఇక్కడి పుష్కరణిలో ఆ చక్రవర్తికి విగ్రహాలు లభించగా వాటినే ఆలయంలో ప్రతిష్టించాడని పురాణం.

ఇక ఈ ఆలయ గర్భగుడిలోని స్వామివారికి ఎదురుగా గరుడ మంటపం ఉండగా, అందులో గరుత్మంతుడి విగ్రహం నమస్కరిస్తునట్లుగా ఉంటుంది. గర్భాలయానికి ముందు ఇరుపక్కలా జయవిజయములు ఉంటారు. ఇంకా ఈ ఆలయంలో స్వామివారిని సేవిస్తునట్లుగ ఉండే పంచలోహాలతో తయారుచేసిన ఆంజనేయస్వామి విగ్రహం దర్శమిస్తుంది. ఈవిధంగా ఎంతో ప్రసిద్ధి చెందిన తిరుపతిలోని ఈ కోదండరామాలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version