Home Unknown facts ప్రపంచానికి విద్య వైద్య శాస్ర అభివృద్ధికి జీవం పోసింది ప్రాచీన భారతీయ ఋషి ఎవరు?

ప్రపంచానికి విద్య వైద్య శాస్ర అభివృద్ధికి జీవం పోసింది ప్రాచీన భారతీయ ఋషి ఎవరు?

0

ప్రస్తుతం టెక్నాలజి పేరుతో ప్రపంచం పరుగులు తీస్తుంది. కానీ ఎలాంటి టెక్నాలజి లేదని చెప్పే కొన్ని వేల సంవత్సరాల క్రితం వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగగా ఆ విద్యనే ప్రస్తుతం అనుసరిస్తున్నారు. ప్రపంచానికి ప్లాస్టిక్ సర్జరీ చేసిన వ్యక్తి అతడే అని చెప్పగా, ప్రపంచానికి విద్యా వైద్య శాస్త్ర అభివృద్ధికి దోహద పడింది కూడా అయన వ్రాసిన గ్రంధమే అని చెబుతారు. మరి అయన ఎవరు? కొన్ని వేల సంవత్సరాల క్రితం అయన వైద్య రంగంలో చేసిన అద్భుతాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Tallest Shiva Lingam Temple

పూర్వం ప్రాచీన శాస్రవేత్తలుగా చెప్పబడే వారిలో సుశ్రుతుడు ఒకరు. ఈయన వారణాసి లో జన్మించారు. ఈయన్ని విశ్వామిత్రుడి కుమారుడని, ధన్వంతరికి ముఖ్య శిష్యుడు అని అంటారు. వారణాసిలో ధన్వంతరి మహర్షి దగ్గర ఈయన వైద్యశాస్రాన్ని నేర్చుకున్నారు. ఈయన నాలుగవ శతాబ్దానికి చెందినవాడు అని కొందరు చెప్పినప్పటికీ భారతీయ పురాణాల ప్రకారం ఈయన నాలుగు లేదా ఐదు వేల సంవత్సరాల పూర్వం వాడని తెలియుచున్నది. మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ, విరిగిన ఎముకలను అతికించడం, కంటి శుక్లాలు తొలగించడం, శస్త్ర చికిత్సలు చేయడంలో ఈయన నిష్ణాతుడు.

ఆయన శుశృత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఆయుర్వేద వైద్యులకు లభించిన మొత్తామొదటి గొప్ప గ్రంధం ఇది. సుశ్రుతుడు దీన్ని సంస్కృతంలో రచించాడు. ఇందులో 184 అధ్యాయాలు ఉండగా, 1120 రకాల వ్యాధుల గురించి పూర్తిగా వివరించాడు. ఇంకా మనిషి శరీరం గురించి, అవయవాల పని తీరు గురించి పూర్తిగా వివరించి వ్రాసాడు. అంతేకాకుండా 700 రకాల ఔషదాల మొక్కలను తెలిపి ఏ మొక్క ఏ రోగానికి ఎలా ఔషదంగా పనిచేస్తుందో పూర్తిగా వివరించాడు. ఇంకా 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేయాలి, జంతువుల అవయవాల నుండి ఔషదాలు తయారుచేసే విద్య గురించి వివరించారు. 101 రకాల శస్తచికిత్సకు ఉపయోగించే పరికరాల గురించి వివరించారు. ఇలా చెప్పుకుంటే వెళితే పూర్వమే ఎన్నో రకాల అద్భుత వైద్య విద్యలని ప్రదర్శించి ఆ విజ్ఞానాన్ని నేటి తరం వారికీ శుశృత సంహిత అనే గ్రంధం ద్వారా ఇచ్చారు.

ఇక నూతన మిలీనియం సందర్భంగా 2000 సంవత్సరంలో బ్రిటన్ లో వైద్య శాస్త్ర అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన శస్త్ర చికిత్సలు చేసిన వైద్యుల జాబితాను ఫొటోలతో సహా ప్రచురించగా అందులో మొదటి పేరు భారతీయ ప్రాచీన శాస్రవేత్త అయిన శుస్రుతుడు పేరు ఉంది. ఇక ఆయన గ్రంథ రచనలు ఎన్నో దేశాల్లో ప్రసిద్ధి చెందగా, పురావస్తు శాఖవారికి లభించిన కొన్ని పరికరాల ఆధారంగా ఆ కలం లోనే కొన్ని సుశ్రుతుని గ్రంథ రచనలు టిబెట్ కి తరలిపోయాయని, వారు ఉపయోగించిన పరికరాల ప్రకారం ఈయన గ్రంధంలో చెప్పిన వైద్యాన్ని అనుసరించారని తెలిపారు.

ఇలా భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి విద్య వైద్య శాస్ర అభివృద్ధికి జీవం పోసింది ప్రాచీన భారతీయ ఋషి సుశ్రుతుడు.

Exit mobile version