ప్రపంచంలో ఎత్తైన శిఖరాలలో కాంచనగంగ మూడవదిగా చెబుతారు. సిక్కిం ప్రజలు ఈ పర్వతాన్ని దైవంగా భావిస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే సూర్యకాంతిని బట్టి ఈ పర్వతం రంగులు మారుతుంది. పర్వత శిఖర పైభాగం వరకు ఎవరు వెళ్లకూడదనే నియమం ఒకటి ఉంది. అంతేకాకుండా ఈ పర్వతం ఐదు నిధులు కలిగి ఉన్న చోటు అని చెబుతారు. మరి ఈ పర్వతం ఎక్కడ ఉంది? కాంచనగంగ గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.