Home Unknown facts శ్రీకృష్ణుడు దర్శనమిచ్చే ఈ ఆలయాల దర్శనం ఒక అద్భుతం

శ్రీకృష్ణుడు దర్శనమిచ్చే ఈ ఆలయాల దర్శనం ఒక అద్భుతం

0

శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదొవ అవతారం శ్రీ కృష్ణావతారం. శ్రీముఖనామ సంవత్సర దక్షిణాయన వర్షఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రం నాల్గవపాదం బుధవారం నాడు అర్థరాత్రి యదువంశంలో దేవకీదేవి, వసుదేవుల పుత్రునిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రీకృష్ణుడు, దేవకి కి ఎనిమిదో గర్భంగా కంసుడు బంధించిన చెరసాలలో జన్మించాడు . మరి దేశంలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చే కొన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. శ్రీకృష్ణ జన్మభూమి – మధుర :

Famous Lord Sri krishna Temples

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఆగ్రాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో యమునానది తీరంలో మధుర ఉంది. ఈ నగరంలోనే శ్రీకృష్ణుడు జన్మించాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మేనమామ కంసుడు పరిపాలిస్తున్న సూర్యసేన సామ్రాజ్యానికి మధుర రాజధాని. శ్రీకృష్ణుడి జన్మస్థానం అంటే దేవకీ, వసుదేవుల జైలు ఉన్న ఈ ప్రదేశంలో హిందువులు పూజలు జరుపుతారు. మధురలో చూడవలసిన వాటిలో అత్యంత ప్రధానమైనది జన్మస్థాన్( శ్రీకృష్ణ జన్మ స్థలం) అనే ఆలయం. ఈ ఆలయానికి ఉత్తరం వైపు ఉన్న గదిలో 4 అడుగుల ఎత్తు ఉన్న వేదికమీద శ్రీకృష్ణుడు పసిబాలుడిగా ఉన్నప్పటి విగ్రహమూర్తి ఉంది.

2. గోవర్ధన గిరి – ఉత్తరప్రదేశ్:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధుర నుండి 30 కీ.మీ. దూరంలో గోవర్దనము అనే క్షేత్రం ఉంది. దీనిని వజ్రభూమిగా పిలుస్తారు. అయితే బ్రహ్మకు, కాళియునకు ఆనాడు స్వామి ప్రత్యేక్షమైన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. ఇంకా యమునా నది తీరానగల ఈ క్షేత్రం శ్రీకృష్ణుడు తన చిటికెన వ్రేలితో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గిరిధారిగా కీర్తించబడిన స్థలంగా ప్రసిద్ధి చెందినది. ఇంకా ఇక్కడ శ్రీకృష్ణుడే స్వయముగా నిర్మించినట్లు చెప్పబడుచున్న బ్రహ్మకుండంలో స్నానం చేసి గోవర్ధనాలయాన్ని భక్తులు దర్శిస్తారు. గోవర్ధన గిరి ప్రదక్షణ విషయానికి వస్తే, గోవర్ధన గిరి ప్రదక్షణ సుమారు 200 కి.మీ. ఉంటుంది. ఇందులో పురుషులైనా సాధువులు ఎక్కువగా ఉంటారు. వీరు 16 రోజులలో ఈ గోవర్ధన గిరి ప్రదక్షణ చేస్తారు. ఇక రెండవ దళం లో గృహస్థులు ఉండే వల్లభక్తుల గోస్వాములది. వీరు ఫాల్గుణ మాసములో ఒక యాత్ర చేస్తారు.

3. ఉడిపి – కర్ణాటక :

కర్ణాటక రాష్ట్రము దక్షిణ కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉడిపి అనే పవిత్ర పుణ్యక్షేత్రం ఉంది. ఉడుప అనే మాట నుంచి ఈ ఉరికి ఉడిపి అనే పేరు వచ్చింది. ఈ ఆలయం 13 వ శతాబ్దం నాటిది అని తెలుస్తుంది. ఈ ఆలయంలోని చిన్ని కృష్ణుడి విగ్రహం ద్వాపరయుగం నాటిదిగా ప్రతీతి. ఈయన ఒక చేతిలో త్రాడు, మరొక చేతిలో కవ్వముతో వివిధ ఆభరణములు ధరించి దివ్య మంగళ రూపంతో భక్తులకి దర్శనమిస్తున్నాడు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉడిపిలో భక్తులకు గర్భాలయ దర్శనం లేదు. తొమ్మిది రంధ్రాలు ఉన్న కిటికీద్వారా స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడి ప్రత్యేకత. శ్రీమధ్వాచార్యులు ఉడిపి దివ్యక్షేత్రంలో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేశారు. వాటిలో శ్రీకృష్ణమఠం ఒకటి.

4. బృందావనం – ఉత్తరప్రదేశ్ :

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో బృందావనం ఉంది. యమునానది తీరంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం శ్రీ కృష్ణుడు గోపికలతో రాసలీల గావించిన స్థలంగా మరియు రాధా కృష్ణుల ప్రణయానికి వేదికగా వర్ణించబడింది. ఈ క్షేత్రంలోనే మీరాబాయి, సూరదాసు మొదలగు భక్తులు గీతాలు ఆలపించారు. ఈ బృందావనంలో నెమళ్ళు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ నిర్మాణానికి సుమారు 11 సంవత్సరాలు పట్టింది. ఇంకా దీనికి మొత్తం అయినా ఖర్చు దాదాపుగా 150 కోట్లు. దీని నిర్మాణానికి 30,000 టన్నుల ఇటాలియన్ మార్బుల్స్ వాడారు.

5. ద్వారకాదీశ ఆలయం – ద్వారక :

గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉంది. ద్వారక అంటే బ్రహ్మ వద్దకు చేరటానికి తలుపు అని భావిస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ భగవానుడు సింహాసనాన్ని అధిష్టించి పరిపాలించిన పవిత్ర స్థలం ఇది అని చెబుతారు. ఈ ఆలయం సుమారు 2500 సంవత్సరాల క్రితం నాటిదని స్థలపురాణం చెబుతుంది.

6. పూరి జగన్నాథ ఆలయం – ఒడిశా :

ఒడిశా రాష్ట్రము పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో పూరీ జగన్నాథ దేవాలయం ఉంది. ఈ ఆలయం నీలాద్రి అనే పర్వతం పైన ఉంది. ఈ ఆలయం సుమారు 4,00,000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైన ప్రకారం కలిగి ఉండి లోపల సుమారు 120 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలో ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ ఎన్నో అద్భుత విషయాలు దాగి ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి అతి ప్రధానమైన రెండు విశేషాలు ఉన్నాయి. మొదటిది నవ కళేబర ఉత్సవం, రెండవది ప్రపంచ ప్రసిద్ధి పొందిన రథోత్సవం.

7. గురువాయూర్‌ – కేరళ :

కేరళ రాష్ట్రం, త్రిసూర్ జిల్లా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో గురువాయూర్‌ లో శ్రీకృష్ణ భగవానుడి ఆలయం ఉంది. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు గురువాయూరప్పన్ అనే పేరుతో కొలువబడుతున్నాడు. శ్రీకృష్ణుడి అనుమతి లేనిదే ఈ ఆలయానికి రాలేరని ఇక్కడి భక్తుల నమ్మకం. భూలోక వైకుంఠం అని పిలువబడే ఈ ఆలయంలోని స్వామివారిని 12 సార్లు దర్శనం చేసుకుంటే మోక్షప్రదాయకము అని చెప్తారు. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు బాలుని రూపంలో దర్శమిస్తుంటాడు.

8. నిధివన్ – ఉత్తరప్రదేశ్ :

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మధుర జిల్లాలోని బృందావనంలో నిధివాన్ అనే ఆలయం ఉంది. అయితే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాదని కలవడానికి ఈ ప్రదేశానికి వచ్చేవాడని చెబుతారు. అయితే గోపికలు శ్రీకృష్ణుడితో అచ్చికలాడిన ప్రదేశం నిధివనం. ఇప్పటికి ప్రతి రాత్రీ గోపికలు కృష్ణుడితో నాట్యమాడుతారని చెబుతుంటారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత నిధివనంలోకి ఎవరినీ అనుమతించరు. అంతేకాకుండా తెల్లారేసరికి గోపికలు చెట్లుగా మారిపోతారని అంటారు. ఈ వనంలోని చెట్ల కొమ్మలు పైకి పెరగకుండా వయ్యారాలు ఒలకబోస్తూ వంకర్లు తిరిగి కిందికి పెరగడం ఒక విశేషం. నిధివన్ లో ఉన్న మొక్కల కాండాలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇక భూమి పై ఒక్క చుక్క నీరు లేకపోయినా చెట్లు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటాయి. ఈ చెట్లే రాత్రి పూట గోపికలుగా మారి నాట్యం చేస్తుంటారని చెబుతారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతున్నారు.

9. శ్రీధామం – పశ్చిమబెంగాల్ :

పశ్చిమబెంగాల్ రాష్ట్రం, మియాపూర్ అనే ప్రాంతంలో శ్రీధామం అనే క్షేత్రం ఉంది. దీనినే చంద్రోదయ దేవాలయం అంటారు. ఈ ఆలయం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఆలయాలలో, అతిపెద్ద ప్రార్థన మందిరాలలో ఒకటిగా చెబుతారు. ఒక విదేశీయుడు మన దేశానికి వచ్చి భగవద్గిత చదివి శ్రీకృష్ణుడి భక్తుడై హిందువు గా మారి ఈ ఆలయాన్ని కట్టించాడు. ఈ ఆలయం దాదాపుగా ఏడు లక్షల చందరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. దాధాపుగా ఈ కట్టడానికి 75 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారంటా. ఇక ఈ ఆలయం 340 అడుగుల ఎత్తులో నిర్మించబడగా, ఆలయంలో దాదాపుగా ఒకేసారి పది వేల మంది భక్తులు కూర్చొని సాంప్రదాయ నృత్యం చేసేందుకు వీలు ఉండేలా విశాలమైన ఒక ఆవరణ ఉంది.

Exit mobile version