Home Unknown facts శరన్నవరాత్రుల్లో చేసే ఉపవాసం… పాటించాల్సిన నియమాలు

శరన్నవరాత్రుల్లో చేసే ఉపవాసం… పాటించాల్సిన నియమాలు

0
9 days of akhanda deepam during navratri

నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ నవరాత్రుల్లో దుర్గా మాత నవశక్తి రూపాలను పూజిస్తారు. చాలామంది భక్తులు ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలను చేకూరుస్తుంది. తొమ్మిది రోజుల నవరాత్రి ఉపవాస సాంప్రదాయం ఉన్నప్పటికీ తొలి రోజు, 8వ రోజు ఉపవాసం ఉంటారు. దీని ద్వారా ఆరోగ్యంతో పాటు తల్లిపై గౌరవం, విశ్వాసం కూడా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఉవవాస దీక్షను పాటించడం వల్ల మనస్సులో కోరికలు నెరవేరడమే కాకుండా మంచి ఫలితాలు ఉంటాయి.

శరన్నవరాత్రులు చాలా పవిత్రమైన రోజులు. కాబట్టి ఈ సమయంలో మొదటగా పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజూ కచ్చితంగా స్నానం చేయాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజగదిని, దేవీ కుటీరాన్ని శుభ్రంగా ఉంచాలి.

మొదటి రోజు కలశ స్థాపన, ముహూర్త సమయం, ఆచారాల ప్రకారం చేయాలి.

ప్రతిరోజూ రెండుసార్లు కలశం ముందు నెయ్యి దీపం వెలిగించాలి.

దుర్గా సప్తశతి పఠించాలి. దుర్గా మంత్రాలు, శ్లోకాలు జపించాలి.

ఉపవాసం చేయాలనుకుంటే ఉపవాసం ఆచారాలను పాటించాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. స్వీయ నిగ్రహం కలిగి ఉండాలి.

కలశానికి ముందు అఖండ జ్యోతి వెలిగిస్తే దానిని ఆర్పవద్దు. ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా చూడాలి.

మీరు ఉపవాసం ఉన్నప్పటికీ ఆకలితో ఉండవద్దు. లైట్‌ ఫుడ్ ఏదైనా తినవచ్చు.

మాంసాహారం, మద్య పానీయాలకు దూరంగా ఉండాలి.
నవరాత్రి సమయంలో గుండు చేయించుకోవద్దు. అంతేకాదు జుట్టు కూడా కత్తిరించుకోకూడదు.
గోళ్లు కత్తిరించకూడదు.

ఎవరి పట్ల కఠినంగా వ్యవహించవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ధ్యానంతో అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి.