Home Unknown facts గోదావరి నది ఎలా జన్మించింది?గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చింది

గోదావరి నది ఎలా జన్మించింది?గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చింది

0

భారతదేశంలో గంగ, సింధు తరువాత అంతి పెద్ద నది గోదావరి. మహారాష్ట్రలోని నాసిక్ లో జన్మించిన గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు. గోదావరి నది ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలసినవి. మరి గోదావరి నది ఎలా జన్మించింది?గోదావరి నదికి ఆ పేరు ఎలా వచ్చినదే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Godavari River Interesting Facts

పూర్వం గౌతమ మహర్షి అరణ్య ప్రాంతంలో నివసిస్తుండగా తన ఆశ్రమానికి దగ్గరలో ఒక పుష్కరిణి నిర్మించుకున్నాడు. ఒకసారి కరువు ఏర్పడి 12 సంవత్సరాలు అక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండగా గౌతముడు వరుణ దేవుడిని ప్రార్ధించగా ఆయన కరుణించకపోవడంతో వరుణ దేవుడి లోకానికి గౌతముడు వెళ్లి వరుణుడిని బంధించి తీసుకువచ్చి నీటిగా మార్చి ఆయన నిర్మించిన పుష్కరణిలోకి వదిలాడు. అయితే అప్పుడు వరుణుడు గౌతముడితో ఇలా అన్నాడు, నీవు పుణ్యాత్ముడవు కనుక నీవు బంధిస్తే ఇక్కడే ఇలా ఉండిపోతున్న నీకు కొంచం పాపం అంటుకున్నను నేను ఇక్కడి నుండి వెళ్లిపోతానని చెప్పాడు.

ఇలా 12 సంవత్సరాల కరువు పూర్తైన తరువాత లోకంలో వానలు కురిపించాల్సిన బాధ్యత వరుణ దేవుడి పైన ఉండటంతో అప్పుడు వరుణుడు బ్రహ్మ దేవుడిని ప్రార్ధించాడు. ఒకనాడు పుష్కరిణి ప్రాంతంలోని వనంలోకి ఓ గోవు రాగా, గౌతముడు గడ్డి పరకతో దానిని అదిలించాడు. దానికి ఆ గోవు చనిపోయింది. దీంతో గౌతముడి గో హత్య పాతకం చుట్టుకోగా వెంటనే వరుణుడు గౌతముడి పుష్కరిణి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు గౌతముడు బ్రహ్మగిరి వెళ్లి శివుడి కోసం ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యేక్షమై వరం కోరుకోమనగా అప్పుడు గౌతముడు శివ జటాజూటం నుంచి గంగను విడువమని ప్రార్థించాడు.

ఆవిధంగా నేలమీదకు దూకిన గంగను గౌతముడు గోవు కళేబరం వద్దకు తీసుకుపోగా గంగ తాకగానే ఆ గోవు మళ్ళీ బ్రతకగ గౌతముడి అంటుకున్న పాపం తొలగిపోయింది. ఆ తరువాత సప్తఋషులు గంగను వెంట తీసుకువెళ్లి సముద్రుడికి అప్పగించారు. గౌతమునికి అంటుకున్న గోహత్య పాతకం తొలగిపోగా శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంగా వెలిశాడని పురాణం. అయితే ఇక్కడ ఉన్న బ్రహ్మగిరి అనే ప్రాంతంలో గౌతమ మహర్షి కారణంగా ఆవిర్బావించిన ఈ నదికి గోదావరి అనే పేరు వచ్చినది అని చెబుతారు. మాఘశుద్ది దశమి నాడు పవిత్ర గంగా ప్రవాహం ఈ గోదావరి నదిగా వెలసిన రోజు. అందుకే ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ బ్రహ్మగిరిలో స్నానం చేయడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

మహారాష్ట్ర, నాసిక్ జిల్లాలో త్రయంబకేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఉన్న కొండలలో ఎదురుగా కనిపించే ఒక కొండని బ్రహ్మగిరి అని అంటారు. ఈ కొండమీదనే గోదావరి నది జన్మస్థలం అని చెబుతారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పే ఈ ఆలయంలో శివుడు త్రయంబకేశ్వరుడిగా పూజలను అందుకుంటున్నాడు. శివుడు మూడు కన్నులు కలిగిన వాడు కనుక ఇక్కడ ఆ పేరుతో భక్తుల పూజలను అందుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ గర్భగుడిలో శివలింగ స్థానంలో ఒక చిన్న గుంటలాగా ఉంటుంది. దానిలో మనకి మూడు శివలింగాలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, శివుడు అని ప్రసిద్ధి. అందువలన ఈ స్వామిని త్రయంబకేశ్వరుడు అని పిలుస్తారు.

Exit mobile version