Home Unknown facts వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని ఎలా పూజిస్తే విశేష ఫలం ఉంటుందో తెలుసా

వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని ఎలా పూజిస్తే విశేష ఫలం ఉంటుందో తెలుసా

0

వినాయకుడు విగ్నాలను నివారించే దేవుడిగా పూజలందుకుంటున్నాడు. మన హిందూ సంప్రదాయంలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. ఆయన్ని గణేశుడు, గణపతి, గణనాయకుడు, ఏకదంతుడు ఇలా అనేక రకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. ఆ గణపతిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం దక్కుతుందని చెబుతారు. అందుకే ప్రతి పూజలోను ఆయనే మొదటగా పూజలందుకుంటాడు. మరి వినాయకచవితి సందర్భంగా వినాయకుడిని ఎలా పూజిస్తే విశేష ఫలం ఉంటుందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vinayakuduపార్వతీపరమేశ్వరుల మొదటి కుమారుడు వినాయకుడు. ఎక్కడైనా గణేశుని ఆకారం ఒకటే. అయితే ఆ రూపం ఏర్పడ్డ తీరును బట్టి ఫలాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా శ్వేతార్క గణపతి అమిత ఫలప్రదాత అన్నది వారి అచంచల విశ్వాసం. అయితే శ్వేతం అంటే తెలుపు, అర్కం అంటే జిల్లేడు తెల్లజిల్లేడు బెరడుతో చేసే గణపతి ప్రతిమలను శ్వేతార్క గణపతిగా పిలుస్తారు. శ్వేతార్క గణపతి షోడశ రూపాల్లో విశిష్టమన్నది భక్తుల విశ్వాసం. ఇక తెల్ల జిల్లేడు విషయానికి వస్తే, వృక్ష జాతిలో తెల్లజిల్లేడు చాల విశిష్టమైంది. తెల్ల జిల్లేడు వేళ్ళమీద వినాయకుడు నివసిస్తాడు. అందుకే జిల్లేడు సిరిసంపదలకు చిహ్నం అని చెబుతుంటారు.

శ్వేతార్కమూల గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహం అని అర్ధం. తెల్లజిల్లేడు వేరులో సాక్షాత్తు వినాయకుడు స్వయంగా కొలువై ఉంటారు.అందుకే ఈ వేరుతో చేసిన గణపతి బొమ్మను స్వయంభూగణపతి అని అంటారు. ఇలా చేసిన గణపతి బొమ్మను ఇంట్లో పూజ గదిలో పెట్టి నిత్యం సేవిస్తే సకల దరిద్రాలు నశిస్తాయి.

అయితే శ్వేతార్క గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం. ఆసనం మీద కుంకుమ వేసి శ్వేతార్క గణపతిని నిలిపి, ఎర్ర వస్త్రం కప్పి, నైవేద్యం సమర్పించి పగడాలు లేదా ఎర్ర రుద్రాక్షలతో పూజించాలి. మందార లాంటి ఎర్రటి పూలు, ఎర్ర చందనంతో పూజ చేయాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ఎలాంటి వాస్తుదోషాలు ఉన్నా తొలిగిపోతాయి. ఆ దోష ప్రభావము మన మీద పడకుండా స్వామి కాపాడతారు. ఈ విగ్రహానికి బెల్లాన్ని నైవేధ్యంగా పెట్టి దానిని శని వాహనమైన కాకికి సమర్పిస్తే విపత్కర పరిస్థితుల నుండి స్వామి రక్షిస్తారు.సకల సంకటాలు తొలిగిపోతాయి. విద్య, ఐశ్వర్యము లభిస్తుంది. ఇంకా ఈ జిల్లేడు వేరును ఇంటి గుమ్మానికి తగిలిస్తే నరఘోష, నరదృష్టి నుండి మనల్ని మనము కాపాడుకోవచ్చు.

అందుకే శ్వేతార్క గణపతిని పూజించిన వారికి వెంటనే గొప్ప ఫలితాలు సాక్షాత్కరిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈవిధంగా ఆ గణపతి సర్వవిఘ్నాలను నివారిస్తూ భక్తులపాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు

Exit mobile version