Home Unknown facts దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో ఈ ఆలయం కూడా ఒకటి

దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో ఈ ఆలయం కూడా ఒకటి

0

పూర్వం శ్రీహరి భక్తుడికి ఒక ఆడశిశువు తులసి వనంలో దొరుకగా ఆమె పెరిగి పెద్దైన తరువాత శ్రీహరిని ధ్యానిస్తూ చివరకి ఆ స్వామిని మెప్పించి స్వామిలో ఐక్యం అయిందని పురాణం. మరి గోదాదేవి వెలసిన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Godadevi Impressed Sri Ranganatha

తమిళనాడు రాష్ట్రం, విరుద్ నగర్ జిల్లాలో శ్రీ విల్లిపుత్తూర్ అనే పుణ్యక్షేత్రం ఉంది. ఇక్కడ శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ ఆలయం ఉంది. ఈ అమ్మవారిని గోదాదేవి అని కూడా పిలుస్తారు. దేశంలో ఉన్న 108 దివ్య తిరుపతులలో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

ఇక పురాణానికి వస్తే, పూర్వం విష్ణుచిత్తుడనే ఒక పండితుడు ఉండేవాడు. యాయన శ్రీహరి కి మహాభక్తుడు. ప్రతి రోజు కూడా అతడు శ్రీహరిని సేవిస్తూ జీవిస్తుండేవాడు. ఒకసారి ఈ భక్తుడికి తులసివనంలో ఓకే ఆడశిశువు దొరికింది. అది శ్రీమన్నారాయణుడి కటాక్షంగా భావించి ఆ శిశువును చేరదీసి గోదాదేవి అని నామకరణం చేసి పెంచాడు. ఇలా పెరిగి పెద్దగా అయినా ఆ శిశువు శ్రీ రంగనాధుడ్ని అమితంగా సెవించింది.

ఆ స్వామియే తన ప్రత్యేక్ష దైవమని ఎప్పటికైనా ఆ స్వామిని చేరాలని ఆకాంక్షించేది. ఈమె ప్రతి రోజుకూడా పుష్పహారాలను చేసి ముందుగా తన మెడలో ధరించి ఆ తరువాత స్వామివారి కైంకర్యానికి పంపేది. ఇలా స్వామిని ఎప్పటికైనా వివాహం చేసుకోవాలని తలిచేది. ఈవిధంగా భక్తితో గానామృతం చేసి తాను తలచినట్లే చివరకి స్వామిని వివాహమాడి శ్రీ రంగనాధునిలో ఐక్యం అయింది.

ఈవిధంగా గోదాదేవి ఆవిర్బావించిన స్థలంగా చెప్పబడుతున్న ఈ ప్రాంగణంలో నిర్మించిన దేవాలయమే ఈ శ్రీ గోదాదేవి ఆలయం. గోదాదేవి దొరికిన తులసివనం ఇప్పటికి భక్తులకి దర్శనం ఇస్తుంటుంది. ఈ తులసివనంలోనే అమ్మవారికి గుర్తుగా ఓ చిన్న మందిరాన్ని నిర్మించి పూజిస్తున్నారు.

ఇలా వెలసిన ఈ అమ్మవారిని దర్శిస్తే కన్యలకు వివాహ యోగం తప్పకుండ కలుగుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా పెళ్లి కానీ కన్యలు ఇక్కడ ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే వెంటనే వివాహం జరిగి, సౌభాగ్య సిద్ది కలుగుతుందని చెబుతారు.

ఈ ఆలయంలో ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణం చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణ మహోత్సవాలకు లక్షలాది మంది భక్తులు అనేక ప్రాంతాల నుండి తరలి వస్తుంటారు.

Exit mobile version