హిందూ దేవాలయాలలో శిల్పకళా నైపుణ్యం అధ్బుతంగా ఉంటుంది. ఇప్పటికి కొన్ని ఆలయాలలో ఉన్న శిల్పకళలు అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తుంటాయి. అయితే హంపి, హళేబీడు, బేలూరు వంటి వాటిలో ఉన్న శిల్పకళను మైమరపించే ఒక ఆలయం ఉందని చెబుతున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయంలో దాగి ఉన్న శిల్పకళ ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్త్రం, మాంద్య జిల్లా, మైసూరు నుండి 40 కి.మీ. దూరంలో ఉన్న సొమనాధ్ పూర్ లో చెన్నకేశవస్వామి, జనార్ధుడు, వేణుగోపాల స్వామివారి ఆలయాలున్నాయి. ఇక్కడి దేవాలయాల మీద అనేక చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. రామాయణ, మహాభారత, భాగవతానికి చెందినవే కాకా హొయసల రాజుల చరిత్ర కూడా అద్దం పట్టేలా హంపి, హళేబీడు, బేలూరు వంటి శిల్పకళను మరిపించేలా ఉంటాయి. ఇచ్చట శిల్పాలు క్రీ.శ. 1268 లో హొయసల చక్రవర్తి మూడవ నరసింహుని ప్రధాన సైన్యాధికారి అయినా సోమనాధుడు శిల్పశాస్ర ప్రావీణ్యుడిగా ప్రసిద్ధి చెందిన జక్కనాచార్యునిచేత ఈ ఆలయాన్ని నిర్మింపచేసాడు. భారతీయుల శిల్పాకళా నైపుణ్యం, ప్రతిభా పాఠవాలను ఈ ఆలయంలోని శిల్పాలలో మనం దర్శించగలం. చెన్నకేశవ ఆలయాన్ని నక్షత్రాకారంలో అబ్బురపరిచే శిల్పసౌందర్యం తో నిర్మించాడు. ఇక 14 వ శతాబ్దంలో ముస్లింల దండయాత్రల నాటి నుండి పూజలకు నోచుకోని ఆలయంగా పర్యాటకులకు భూతల స్వర్గంగా నాటి వైభవానికి సాక్ష్యంగా మిగిలిపోయింది. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి విగ్రహం ఒకే శిలనుంచి మలచబడిన నల్లరాతి విగ్రహం. ఈ స్వామి చేతిలో ఉన్న వేణువులో ఎక్కడ తట్టిన మధురంగా గంటమ్రోగినట్లు నాదం వినిపిస్తుంది. మిగతా విగ్రహ భాగాన్ని ఎక్కడ తట్టిన ఆ నాదం వినిపించకపోవడం ఆశ్చర్యం. గత 7 శతాబ్దాల నుండి వస్తున్న పర్యాటకులు రక రకలా వస్తువులతో వేణును తట్టుట వలన స్వామి నోటికి దగ్గరగా ఉన్న వేణువు కొంతభాగం విరిపోయింది. అయినా విరగక మిగిలిన భాగం ఈనాటికి కూడా మధురంగా గంట మ్రోగినట్లు మొగుట ఒక అధ్బుతం అనే చెప్పాలి.