Home Unknown facts Here 16 Good Qualities One Should Adopt from Lord Rama

Here 16 Good Qualities One Should Adopt from Lord Rama

0

శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రామావతారం. తేత్రాయుగంలో రామాయణం జరుగగా రామాయణ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించాడు. శ్రీ మహావిష్ణువు మానవ అవతారంలో జన్మించిన రాముడికి 16 ఉత్తమ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. మరి శ్రీరాముడు గొప్పవాడు చెప్పే ఆ 16 ఉత్తమ లక్షణాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1.గుణవంతుడు- గుణం కలిగినవాడు

1-uthamma lakshnalu

2. వీరుడు – మంచి ప్రతాపం కలిగినవాడు

3. ధర్మజ్ఞుడు – ధర్మం అంటే ఏంటో తెలిసినవాడు

4. కృతజ్ఞుడు – చేసిన మేలు మరువనివాడు

5. సత్య వాక్య పరిపాలకుడు – ఎప్పుడు సత్యాన్ని పలికేవాడు

6. ధ్రుఢవ్రతుదు – స్థిర సంకల్పం కలవాడు

7. ఉత్తమ చరిత్ర కలవాడు – మంచి నడవడి కలవాడు

8. సర్వ భూతముల హితము కోరేవాడు – సర్వ ప్రాణుల హితాన్ని కోరేవాడు

9. విద్వాంసుడు – జ్ఞానం కలవాడు

10. సమర్ధుడు – సామర్థ్యం కలవాడు

11. ప్రియవర్తనుడు – సదైక ప్రియదర్శనుడు

12. ఆత్మవంతుడు `- ధైర్యం, వ్యక్తిత్వం కల్గవాడు

13. జితక్రోధుడు – కోపాన్ని జయించేవాడు

14. ద్యుతిమంతుడు – తానూ వెలుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చేవాడు

15. అసూయ లేనివాడు

16. ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు.

ఈవిధంగా మానవజాతికి ప్రతీకగా నిలిచిన ఉత్తంపురుషుడు, పురుషోత్తముడు, షోడశగుణ, కళాప్రపూర్ణుడే శ్రీ రామచంద్రుడు.

Exit mobile version