Home Unknown facts శ్రీమహావిష్ణువు పార్థసారధిగా దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది?

శ్రీమహావిష్ణువు పార్థసారధిగా దర్శనమిచ్చే ఆలయం ఎక్కడ ఉంది?

0

శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా చెబుతారు. శ్రీమహావిష్ణువు పార్థసారధిగా దర్శనమిచ్చే ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆ స్వామి మూలవిరాట్టు ఎలా ఉంటుంది? ఈ ఆలయంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Maha Vishnuతమిళనాడు రాష్ట్రం, చెన్నై సముద్ర తీరాన కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రిప్లికేన్ లో శ్రీ పార్థసారధి ఆలయం ఉంది. ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 8 వ శతాబ్దంలో పల్లవ రాజులూ నిర్మించారు. ఇక్కడ కొలువై ఉన్న పార్థసారథి విగ్రహాన్ని ఆత్రేయ మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు.

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, సుమతి అనే మహారాజుకి ఇచ్చిన మాట ప్రకారం వేంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశారని అంటారు. అయితే కురుక్షేత్రంలో భీష్ముడు విడిచిన అస్రాలు, బాణాలు శ్రీకృష్ణుడికి కూడా తగలడంవలనే మూలవిరాట్టు ముఖంపైన కొన్ని మచ్చలు అనేవి ఉన్నాయి. ఇంకా ఇక్కడ సాధారణానికి భిన్నంగా స్వామికి కోరమీసాలు ఉన్నాయి. అయితే కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టానని ప్రతిజ్ఞ చేయడం వలన ఈ విగ్రహానికి మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం అనేది ఉండదు. ఆ స్వామి చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది.

ఇక ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయంలో వేరుశనిగా నూనె మరియు మిరపకాయలు నిషిద్ధం. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పార్థసారథి ఆలయానికి మరియు శ్రీ నరసింహ ఆలయానికి వేరు వేరుగా ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేస్తారు.

Exit mobile version