Home Unknown facts HIndu Dharmam Vaati Gurinchi Em Cheputhundi?

HIndu Dharmam Vaati Gurinchi Em Cheputhundi?

0

దైవభక్తి ఉన్న ప్రతి ఒక్కరు సంప్రదాయాలని గౌరవిస్తూ ప్రతి వస్తువు ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా చాలా పవిత్రంగా ఉంటారు. పూజ చేస్తున్నప్పుడు పూజ కోసం ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్బత్తీలు, కర్పూరం లాంటి వాటిని నెల మీద లేదా మంచం పైన అసలు పెట్టము. ఎందుకంటే అలా కిందపెట్టిన వాటిని పూజకి ఉపయోగిస్తే అశుభం అని మన నమ్మకం. ఇవి కాకుండా హిందు దర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులను కింద పెట్టకూడదు. అలా పెడితే అంతా అశుభమే జరుగుతుందని నమ్మకం. ఇంతకీ అస్సలు క్రింద పెట్టకూడని ఆ వస్తువులు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.hindu dharmam

1.దీపం:దేవుడి ముందు పెట్టే దీపాలను నేల మీద ఎట్టి పరిస్థితిలోనూ పెట్టరాదు. వాటిని వెలిగించినా, వెలిగించకపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రంపైనే ఉంచాలి. వాటిని నేలపై పెట్టరాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవతలను అవమానించినట్టే అవుతుందని చెప్పుతున్నారు.

2.బంగారం: బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తారు. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వద్ద ధనం నిలువదు, అన్నీ సమస్యలే వస్తాయి.

3.జంధ్యం: హిందువుల్లో చాలా మందికి జంధ్యం ధరించే ఆచారం ఉంటుంది. అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు. తల్లిదండ్రులు, గురువులకు ప్రతి రూపంగా దాన్ని భావిస్తారు. ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుంది. అందుకని దాన్ని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు.

4.శంఖువు: శంఖువులో సాక్షాత్తూ లక్ష్మీ దేవి కొలువై ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు. పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

5.సాలిగ్రామం:నేపాల్లోని గండకీ నది తీరంలో ఓ రకమైన నల్ల రాయి దొరుకుతుంది. దాన్ని సాలిగ్రామం అంటారు. ఈ రాయి విష్ణువుకు ప్రతిరూపమని చెబుతారు. సాలాగ్రామం నేలపై అస్సలు పెట్టకూడదు. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయి. ఒక వేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలని చెబుతున్నారు.

6.శివలింగం:శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదట. అలా చేస్తే అన్నీ సమస్యలే ఎదురవుతాయట. ఒక వేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాలని చెబుతున్నారు.

ఇలా ఈ కొన్ని వస్తువులని మన హిందూధర్మం ప్రకారం క్రింద పెట్టకూడదని చెబుతారు.

Exit mobile version