Home Unknown facts యమునానదిలో నిలబడి ఉన్నట్లుగా దర్శనం ఇచ్చే హనుమాన్ ఆలయం

యమునానదిలో నిలబడి ఉన్నట్లుగా దర్శనం ఇచ్చే హనుమాన్ ఆలయం

0

ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ధైర్యానికి నిజమైన భక్తికి నిదర్శనం అయినా హనుమంతుడు లేని గ్రామం అంటూ ఉండదు. ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇక ఇక్కడ దర్శనం ఇచ్చే హనుమంతుడి ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Hanuman

ఢిల్లీలోని యమునా నదిపై మర్కట హనుమాన్ ఆలయం ఉంది. అయితే హనుమాన్ సేతు వంతెన దాటగానే నిగమ బోధ ఘాట్ తీరంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గర్భ గుడిలో దర్శనం ఇచ్చే హనుమంతుడి విగ్రహం నాలుగు అడుగుల ఎత్తులో గంధ సింధూరపు పూతతో కనిపిస్తుంది. అయితే హనుమంతుడి కుడిచేతిలో సంజీవ పర్వతం ఉండగా, ఎడమచేయి భూమిని ఆని ఉంటుంది.

ఇక పురాణానికి వస్తే, ఈ ఆలయం కృతయుగం చివరలో లేదా తేత్రాయుగం మొదటలో నిర్మించినట్లిగా చెబుతారు. అయితే శ్రీరాముడు రావణుడిని సంహరించి అయోధ్య నగరానికి సీతాదేవిని తీసుకువచ్చిన తరువాత ఒకడు సీతాదేవి లంకలో ఉండటం పైన వ్యంగ్యంగా మాట్లాడితే ఆ మాటలు తెలిసి శ్రీరాముడు గర్భవతి అయినా సీతాదేవిని అడవులకి పంపిస్తాడు.

అయితే ఇలా సీతాదేవి అడవులకు వెళ్లిన తరువాత హనుమంతుడు శ్రీరాముడు ఈ యమునా నది తీరంలో ఒకసారి వచ్చినప్పుడు రాముడు అలసిపోయి ఉండగా అది గమనించిన హనుమంతుడు దగ్గరలో ఉన్న పండ్లని తెచ్చి శ్రీరామునికి ఇచ్చి తినిపించి ఆకలిని పోగొట్టాడని అంటారు. ఆలా శ్రీరాముడు తిని వదిలేసినా పండ్లను హనుమంతుడు మహాప్రసాదంగా కళ్ళకి అద్దుకొని తిన్నాడని పురాణం.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ హనుమాన్ విగ్రహం చుట్టూ ఎప్పుడు నీరు నిండే ఉంటుంది. అంటే స్వామివారు యమునానదిలో నిలబడి ఉన్నట్లుగా చెబుతారు. అయితే యమునా బజార్ లో మర్కట బాలాజీ అనే స్వామి మొఘుల్ కాలంలో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు. అందుకే దీనిని కొంతమందు భక్తులు యమునాబజార్ హనుమాన్ మందిరం, మర్కట్ హనుమాన్ ఆలయం అనీ పిలుస్తుంటారు.

ఇలా ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన ఈ ఆలయంలో ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, వేదాంతబోధ, ధార్మిక ఉపన్యాసాలు ఘనంగా జరుగుతాయి.

Exit mobile version