Home Unknown facts ప్రెగ్నన్సీ సమయంలో మహిళలు ఎన్ని నెలలు వరకు పూజలు చేయవచ్చు

ప్రెగ్నన్సీ సమయంలో మహిళలు ఎన్ని నెలలు వరకు పూజలు చేయవచ్చు

0

ప్రెగ్నన్సీ మహిళలకు కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని చోట్లకు వెళ్ళకూడదు, కొన్ని పదార్థాలు తినకూడదు, కొన్ని పనులు చేయకూడదు అని నిబంధలు ఉంటాయి. అలాగే చాలా మంది గర్భిణీలకు గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చెయ్యొచ్చా..? చెయ్యకూడదా ? అలానే ఒకవేళ చెయ్యచ్చు అంటే ఎన్ని నెలల వాళ్ళు చెయ్యాలి. ఇలా అనేక సందేహాలు ఉంటాయి.

గర్భవతిగా ఉన్నప్పుడు పూజలు చేయొచ్చాహిందూ సంప్రదాయంలో పూజలు ఎక్కువగా ఉంటాయి. అయితే నిత్యం అలవాటైన ఈ పూజల్ని కడుపుతో ఉన్న వాళ్ళు చెయ్యకూడదని అంటూ ఉంటారు. దానికి కొన్ని రకాల కారణాలు కూడా చెబుతున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు తేలిక పాటి పూజలు చేయవచ్చు, కానీ కొబ్బరి కాయ మాత్రం కొట్టకూడదట.

గర్భిణీలు గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేయకూడదు అని చెబుతారు. పలు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్లకూడదని శాస్త్రాలలో చెప్పబడి ఉన్నది. కనుక గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి లేదని కొంత మంది పూజారులు చెబుతుంటారు. కనుక గర్బీణీలు ఈ పద్ధతులని అనుసరించడం మేలు ఎందుకంటే మీ క్షేమం అన్నింటి కంటే కూడా ముఖ్యం.

 

Exit mobile version