మంచి ముహూర్తం, వాస్తు చూసుకొని ఇల్లు కట్టుకుంటుంటారు. అయినా కొంతమంది ఆ ఇల్లు కలిసి రాలేదని బాధపడుతుంటారు. అందుకు కారణం లేకపోలేదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇల్లు కట్టుకునే సమయంలో వాస్తు శాస్త్రాన్ని మాత్రమే పాటిస్తుంటారు. కానీ ఆ శాస్త్రానికి మూలమైన జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించరు.
జ్యోతిష శాస్త్ర సూత్రాల ప్రకారం ఇల్లు ఎవరి పేరు మీద నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందో వారి పేరు మీదే నిర్మించాలి. ఇంటి ఓనర్ అంటే సాధారణంగా మగవారిని అనుకుంటారు. కానీ జ్యోతిష శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం ఆడవారు.. అంటే భార్యని ని కూడా గృహ యజమానిగా భావించాలి. అందుకే భార్య, భర్త ఇద్దరి జాతక చక్రాలను అనుసరించి, ఎవరి పేరున బాగుంటుందో తెలుసుకొని నిర్మిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే కొడుకుకి పెళ్లికి ముందే ఇల్లు కడితే.. పెళ్లి అయినా తర్వాత ఆ జంట అందులోకి వెళితే నష్టాలు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే కొడుకుకి వివాహం అనంతరం కొడుకు, కోడలు జాతకాలు చూసి ఇల్లు నిర్మించడం మంచిది.