Home Unknown facts పంచ భావన్నారాయణ క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయం!

పంచ భావన్నారాయణ క్షేత్రాలలో ముఖ్యమైన ఆలయం!

0

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచ భావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన ఆలయం బాపట్ల భావన్నారాయణస్వామి ఆలయం అని చెబుతారు. మరి ఈ ఆలయ స్థలపురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Bhavanarayana Temple

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్లలో శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం ఉంది. అతి ప్రాచీనమైన వైష్ణవ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయాన్ని సుమారుగా 1400 సంవత్సరాల క్రితం చోళరాజుల నిర్మించినట్లుగా తెలియుచున్నది. ఇక శివుడికి పంచ క్షేత్రాలు ఉన్నట్లుగానే, శ్రీమహావిష్ణువుకు కూడా పంచ భావన్నారాయణ క్షేత్రాలు ఉన్నవి. అందులో బాపట్ల ఆలయం ప్రధానమైనదని చెబుతారు.

ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం ఇక్కడ బ్రహ్మర్షులు సమావేశమై ఒక యాగకుండమును ఏర్పాటు చేసి శ్రీమన్నారాయుడిని స్మరిస్తూ హోమం చేస్తుండేవారట. అయితే ఆ స్వామివారు యుగధర్మమును అనుసరించి వారికీ వేర్వేరు రూపాలతో దర్శనం ఇస్తుడేవారట. అయితే ద్వాపరయుగంలో క్షిరవృక్షంలో శేషరూపం ధరించిన స్వామివారు కలియుగంలో కూడా అందులోనే ఉండిపోగా ఒక చోళరాజు తన యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ రాజు ఏనుగులు ఇక్కడ ఉన్న క్షిరవృక్షం ఆకులూ తినబోగా వాటి తొండములు చెట్టు కి అంటుకుపోయి రాకపోవడంతో ఆ ఆశ్చర్యాన్ని చూసి రాజు అవి చేసిన పొరపాటును తెలుసుకొని ఇక్కడ ఆలయాన్ని కట్టించి అందులో స్వామివారిని ప్రతిష్టించి పూజించాడని పురాణం.

ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, క్రీ.శ. 594 లో క్రిమి కంఠ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో వల్లాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, శింగరమ్మ, ధనకొండలమ్మ, మూలకారమ్మ, నాగభూషణమ్మ, బొబ్బలమ్మ అనే ఎనిమిది మంది గ్రామ శక్తులను ఎనిమిది దిక్కుల్లో ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే బ్రహ్మోత్సవాలకి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది.

Exit mobile version